అల్లు అర్జున్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. అసలు సౌండ్ లేదేంటి..!
on Nov 3, 2025

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అంత ప్రతిష్టాత్మక అవార్డు వస్తే.. మీడియా, సోషల్ మీడియా మారుమోగిపోవాలి కదా. అలాంటిది పెద్దగా హడావుడి లేదేంటని ఆశ్చర్యపోతున్నారా?. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. (Dadasaheb Phalke)
భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద అత్యున్నత సినీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందిస్తున్నది. తెలుగులో ఎల్.వి.ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె.విశ్వనాథ్ వంటి దిగ్గజాలు ఈ అవార్డును అందుకున్నారు. తెలుగు నుండి చివరగా 2016 లో విశ్వనాథ్ కి ఈ గౌరవం దక్కింది. ఇక ఈ ఏడాదికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మలయాళ నటుడు మోహన్ లాల్ ని వరించింది. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారత ప్రభుత్వం ప్రతి ఏడాది జాతీయ అవార్డులతో పాటు అందిస్తుంది. సినీ రంగానికి సేవలందించిన దిగ్గజాలకు ఈ అవార్డును ఇస్తుంటారు. అయితే దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద ఓ ప్రైవేట్ సంస్థ కూడా అవార్డులు ఇస్తోంది. 'దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్' పేరుతో ప్రతి ఏడాది వేడుక నిర్వహించి.. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అల్లు అర్జున్ గెలుచుకున్నాడు.

Also Read: 'బాహుబలి: ది ఎపిక్' కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి!
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ రెండూ ఒకటే అనుకొని కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రభుత్వం ఇస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అనేది ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కి వచ్చింది ప్రైవేట్ అవార్డు.
భవిష్యత్ లో అల్లు అర్జున్ భారత ప్రభుత్వం నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నా ఆశ్చర్యంలేదు. ఇప్పటికే పుష్ప సినిమాకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకొని, ఈ ఫీట్ సాధించిన మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. భవిష్యత్ లో మరిన్ని సంచలనాలు సృష్టించి, ప్రభుత్వం నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకునే స్థాయికి ఎదుగుతాడేమో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



