అర్ధరాత్రి పెద్ద గొడవ.. నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు!
on Aug 5, 2021
యాంకరింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన మెగా డాటర్ నిహారిక వెబ్ సిరీస్ లు, సినిమాలతో నటిగా, నిర్మాతగా సత్తా చాటుతోంది. మెగా డాటర్ గా పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక గత డిసెంబర్ లో వ్యాపారవేత్త జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడొక వివాదంలో ఆమె భర్త పేరు రావడం హాట్ టాపిక్ గా మారింది.
నిహారిక భర్త చైతన్య పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత అర్ధరాత్రి నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని.. ఆమె భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నిహారిక భర్త సైతం అపార్ట్మెంట్ వాసులపై ఫిర్యాదు చేశారు. ఇరువురి తరుపున ఫిర్యాదులు అందుకున్న విచారణ జరుపుతున్నారు.
నిహారిక భర్త చైతన్య పై అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిహారిక ఇంట్లో జరిగిన గొడవ ఏంటి? అపార్ట్ మెంట్ వాసులకు, చైతన్యకు మధ్య జరిగిన గొడవ ఏంటి? అనే చర్చనీయాంశమైంది. మరి దీనిపై నిహారిక ఎలా స్పందిస్తుందో చూడాలి.