తేడా రాకుండా చూసుకోవాలి.. టైలర్ మేడ్ ఖాయమా!
on Jan 20, 2026

-చిరంజీవి, బాబీ పరిస్థితి ఏంటి!
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-షూటింగ్ ఎప్పుడు
-రికార్డులు వస్తాయా
మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)హిట్ అవుతుందిలే అని అనుకున్నారు కానీ, ఎంటైర్ నాలుగున్నర దశాబ్దాల చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఎవరు ఊహించలేదు. చిరంజీవి మేనరిజమ్స్, స్టైల్ కి కంటెంట్ చాలా బలంగా నిలవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు,ప్రేక్షకులు మెగా పూనకం ఆవహించినట్టుగా థియేటర్స్ కి తరలి వెళ్తున్నారు.దీంతో ఈ ఇయర్ సంక్రాంతి కాస్త చిరు సంక్రాంతిగా మారిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫస్ట్ వీక్ సాధించిన 292 కోట్ల గ్రాస్ నే ఇందుకు సజీవ సాక్ష్యం.
దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)మన శంకర వరప్రసాద్ ని రూపొందించిన విధానం కూడా మరో మెయిన్ రీజన్. ఆయన పని తనం వల్ల అభిమానులు, ప్రేక్షకుల మనస్సులో తనకున్న స్థానం ఏ పాటిదో చిరంజీవి మరో సారి నిరూపించాడు. ఫ్యాన్స్ కూడా వింటేజ్ చిరంజీవి తమ కళ్ళ ముందే ఉన్నాడనే జోష్ లో మెగా స్టార్ తదుపరి చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక్కరిలో మాత్రం ఫుల్ టెన్షన్ తప్పదనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు దర్శకుడు బాబీ.
చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బాబీ(Bobby)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. అధికారకంగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చిన ఈ మూవీ నెక్స్ట్ మంత్ షూటింగ్ కి వెళ్లనుంది. మన శంకర వర ప్రసాద్ బ్లాక్ బస్టర్ తో బాబీ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఆ అంచనాలకి ఒక్క పర్శంట్ తగ్గకుండా కథ, కథనాలు, చిరంజీవి క్యారక్టర్, సాంగ్స్ ,మిగతా ఆర్టిస్టుల క్యారక్టర్ డిజైన్స్ ఉండాలి. ఇందుకు బాబీ చాలా కసరత్తులు చెయ్యాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యాన్స్ ని మెప్పించడంతో పాటు ప్రేక్షకులు చిరంజీవి నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ అంశాలన్నీ పొందుపరచాలి.
టోటల్ గా సినిమా విషయంలో పిన్ టూ పిన్ జాగ్రతగా చూసుకోవడం తప్పనిసరి. ఒక రకంగా బాబీ కి కత్తి మీద సాము లాంటిది. ముఖ్యంగా మన శంకర వరప్రసాద్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండంతో రిజల్ట్ విషయంలో ఏ మాత్రం తేడా రాకుండా చూసుకోవాలని పలువులు సినీ క్రిటిక్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also read: గద్దర్ అవార్డులకి ముహూర్తం ఖరారు.. ఈ సారి స్పెషల్ ఇదే
ఇక చిరంజీవి, బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య వచ్చి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డల్ గా సాగుతున్న చిరు కెరీర్ కి మంచి ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా చిరు ఇమేజ్ కి తగట్టుగా టైలర్ మేడ్ సబ్జెట్ తో బాబీ రూపొందించాడు. టైలర్ మేడ్ అంటే ఏయే అంశాలు చిరుకి సూటవుతాయో పక్కా కొలతలతో రూపొందించాడు. మరి ప్రస్తుత మూవీ కూడా అదే విధంగా డిజైన్ చేస్తాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కబోతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బాబీ ప్రీవియస్ మూవీ డాకు మహారాజ్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



