దీపావళి బరిలో కళ్యాణ్ రామ్ చిత్రం!
on Sep 22, 2021
గత ఏడాది సంక్రాంతికి `ఎంత మంచివాడవురా!` అంటూ పలకరించారు నందమూరి కళ్యాణ్ రామ్. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో.. రాబోయే చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారాయన. ఈ క్రమంలోనే.. త్వరలో హిస్టారికల్ ఫిక్షన్ `బింబిసార`తో ఎంటర్టైన్ చేయనున్నారు కళ్యాణ్ రామ్. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందని సమాచారం.
ఇదిలా ఉంటే.. `బింబిసార`ని మూడు భాగాలుగా రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేసిందని.. ఇందులో భాగంగా ఫస్ట్ పార్ట్ ని దీపావళి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. ఇప్పటికే ఈ తొలి భాగం తాలుకు చిత్రీకరణ పూర్తయిందని.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. ఈ హిస్టారికల్ ఫిక్షన్ మొదటి భాగం కళ్యాణ్ రామ్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువస్తుందేమో చూడాలి.
కాగా, `బింబిసార`లో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ నాయికలుగా నటిస్తున్నారు.
Also Read