Home

»

Latest News

Balakrishna: బాలయ్య-కొరటాల మూవీ ముహూర్తం ఫిక్స్.. లాంచ్ ఎప్పుడంటే..?

Apr 27, 2026

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో ఒక భారీ సినిమా రూపుదిద్దుకోనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ బాలయ్యకు కథను వివరించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొరటాల మార్క్ సామాజిక సందేశంతో పాటు, బాలకృష్ణ అభిమానులు కోరుకునే పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోంది. 

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర యూనిట్ ఈ ప్రాజెక్ట్‌ను మే నెల తొలివారంలో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాటు, ఈ కొరటాల ప్రాజెక్ట్‌ను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రారంభోత్సవం రోజే అధికారికంగా వెల్లడించనున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com