బాలయ్యతో మరోసారి కళ్యాణ్ రామ్?
on May 4, 2021
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో నటించిన `బాలగోపాలుడు` (1989)తో బాలనటుడిగా తెరగేంట్రం చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆపై `తొలి చూపులోనే` (2003)తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్.. భారీ విరామం తరువాత నటరత్న నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందిన `యన్టీఆర్ కథానాయకుడు` (2019), `యన్టీఆర్ మహానాయకుడు` (2019) చిత్రాల్లో బాబాయ్ బాలయ్యతో కలిసి నటించారు. `యన్టీఆర్` బయోపిక్ గా రూపొందిన ఆ రెండు సినిమాల్లోనూ తన తండ్రి నందమూరి హరికృష్ణ పాత్రలో దర్శనమిచ్చారు కళ్యాణ్ రామ్.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మరోమారు బాబాయ్ బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట అబ్బాయ్ కళ్యాణ్. ఆ వివరాల్లోకి వెళితే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మరో హీరోకి కూడా స్థానముందట. ఆ వేషంలో కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని అంటున్నారు. అదే గనుక నిజమైతే.. తన తొలి చిత్రం `పటాస్` తరువాత కళ్యాణ్ రామ్ తో అనిల్ చేసే సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టిస్టారర్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read