జర్నలిజం స్టూడెంట్‌గా అవికా గోర్
on May 3, 2021
పక్కింటి అమ్మాయి తరహా పాత్రలకు చిరునామాగా నిలిచిన యువ కథానాయికల్లో అవికా గోర్ ఒకరు. `ఉయ్యాలా జంపాలా`, `సినిమా చూపిస్త మావ`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా` వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు తెలుగులో ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ తనది ఇదే బాణి.
కట్ చేస్తే.. ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ త్వరలో జర్నలిజం స్టూడెంట్ గా థ్రిల్ చేయబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. సజ్జా వెంకటేశ్వరరావు నిర్మాణంలో బల్ వీర్ దర్శకత్వంలో ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఇందులో అవికా గోర్ దే ప్రధాన పాత్ర. కథానుసారం.. ఆమె జర్నలిజం విద్యార్థి పాత్రలో కనిపించనుంది. ఓ విషయమై పరిశోధన చేస్తున్న సమయంలో ఆమెకి ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అవికకి నటిగా మంచి గుర్తింపు తెచ్చే పాత్ర ఇదని సమాచారం.
కాగా, ప్రస్తుతం అవికా గోర్ చేతిలో మరో రెండు తెలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటి యువసామ్రాట్ నాగచైతన్య - వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న `థాంక్ యూ` కాగా.. మరొకటి రచయిత శ్రీధర్ సీపాన డైరెక్ట్ చేస్తున్న మూవీ. మరి.. రాబోయే ఈ మూడు చిత్రాలతో అవిక ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.