ఓటీటీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్!
on Jul 29, 2021
ఆర్య.. దక్షిణాది సినీ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. తమిళనాట స్టార్ డమ్ చూసిన ఆర్య.. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ నటుడిగా తనదైన ముద్రవేశాడు. కేవలం కథానాయకుడి పాత్రలకే పరిమితం కాకుండా ప్రతినాయకుడిగానూ అలరిస్తున్నాడు ఆర్య.
ఇదిలా ఉంటే.. ఓటీటీ ట్రెండ్ ఊపందుకున్నాక తక్కువ గ్యాప్ లోనే రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడీ టాలెంటెడ్ యాక్టర్. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ సంవత్సరం మార్చి 12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ `టెడ్డీ`తో ఆబాలగోపాలాన్ని అలరించిన ఆర్య.. జూలై 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పిరియడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా `సార్పట్ట పరంపరై`తోనూ ఇంప్రెస్ చేశారు. నటుడిగా విభిన్న పాత్రల్లో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. మరి.. మున్ముందు కూడా ఓటీటీ వేదికగా ఆర్య ఈ విజయపరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. ఆర్య తాజా తమిళ చిత్రాలు `అరణ్మనై 3`, `ఎనిమీ` షూటింగ్ పూర్తిచేసుకున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ జనం ముందుకు రాబోతున్నాయి.
Also Read