అనుష్క ఇంట్లో రామ్చరణ్!!!
on Feb 6, 2019
మెగాస్టార్ చిరంజీవి `సైరా` నరసింహారెడ్డి షూటింగ్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ యేడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఓ కీలక పాత్ర చేస్తోంది. తాజాగా మరో స్టార్ హీరోయిన్ ని ఈ సినిమాలో గెస్ట్ ఆఫియరెన్స్ ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. `సైరా`లో ఓ చిన్న పాత్ర ఉందట. ఈ గెస్ట్ ఆఫియరెన్స్ కి స్టార్ హీరోయిన్ అనుష్క అయితే బాగుంటుందని భావించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి నిర్మాత , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర చెప్పాడట. దాంతో రామ్ చరణ్ పర్సనల్ గా అనుష్క ఇంటికి వెళ్ళి మరీ ఈ గెస్ట్ ఆఫియరెన్స్ లో నటించాల్సిందిగా కోరాడట. అవకాశం ఉంటే అనుష్క ఈ ఆఫర్ ని కాదనే ప్రసక్తి లేదు. సో.. అన్ని కుదిరితే `సైరా` లో అనుష్క కూడా కనువిందు చేస్తుందని ఊహించవచ్చు.