పవర్ స్టార్ తో `పటాస్` కెప్టెన్?
on Oct 18, 2021
`పటాస్`తో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి.. మొదటి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఆపై `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `సరిలేరు నీకెవ్వరు`తో వరుస విజయాలు చూశాడు. ప్రస్తుతం ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3` చేస్తున్నాడు. ఇందులోనూ విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. 2022 ఆరంభంలో ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. `ఎఫ్ 3` తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేయనున్న అనిల్ రావిపూడి.. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం తీసే ప్రయత్నాల్లో ఉన్నట్టు టాలీవుడ్ టాక్. అంతేకాదు.. అనిల్ గత చిత్రాల తరహాలో ఇది కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, పవన్ ప్రస్తుతం `భీమ్లా నాయక్`, `హరిహర వీరమల్లు` చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆపై `భవదీయుడు..! భగత్ సింగ్`తో పాటు సురేందర్ రెడ్డి డైరెక్టోరియల్ చేయనున్నారు. వాటి తరువాతే అనిల్ కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశముంది. చూద్దాం.. ఏం జరుగుతుందో!
Also Read