సర్ ప్రైజ్.. 50 కోట్ల బిజినెస్ చేసిన చిన్న సినిమా!
on Jan 11, 2026

విడుదలకు ముందు చిన్న సినిమాలకు మంచి బిజినెస్ జరగడమే గొప్ప విషయం. అలాంటిది ఏకంగా రూ.50 కోట్ల బిజినెస్ జరగడం అనేది మామూలు విషయం కాదు. 'అనగనగా ఒక రాజు' మూవీ అలాంటి అరుదైన ఘనతనే సాధించింది. (Anaganaga Oka Raju)
ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనున్న సినిమాలలో 'అనగనగా ఒక రాజు' ఒకటి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. మారి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా.. జనవరి 14న థియేటర్లలో అడుగు పెట్టనుంది.
ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా 'అనగనగా ఒక రాజు' చిత్రం రూపొందింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నవీన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'అనగనగా ఒక రాజు'పై ప్రేక్షకుల దృష్టి పడింది. ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా పట్ల ఆసక్తిని రెట్టింపు చేసింది.
మంచి బజ్ క్రియేట్ కావడంతో థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలిపి 'అనగనగా ఒక రాజు' సినిమా ఏకంగా రూ.50 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.28 కోట్లు వచ్చాయని సమాచారం. దీంతో ప్రొడ్యూసర్స్ మంచి ప్రాఫిట్స్ పొందారట. ఒక యంగ్ హీరో మూవీ ఈ స్థాయి బిజినెస్ చేసి, విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావడం అనేది గొప్ప విషయమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



