2022లో `బ్రీత్` నయా సీజన్!
on Oct 21, 2021
భారతీయ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వెబ్ - సిరీస్ ల్లో `బ్రీత్` ఒకటి. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `బ్రీత్` సిరీస్ నుంచి ఇప్పటివరకు రెండు సీజన్స్ వచ్చాయి. 2018లో స్ట్రీమ్ అయిన `బ్రీత్` ఫస్ట్ సీజన్ లో మాధవన్, అమిత్ షాద్, హృషికేశ్ జోషి, సప్న పబ్బీ, నీనా కులకర్ణి ముఖ్య పాత్రల్లో నటించగా.. 2020లో స్ట్రీమ్ అయిన సెకండ్ సీజన్ `బ్రీత్ః ఇన్ టు ద షాడోస్`లో అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్, అమిత్ షాద్, హృషికేశ్ జోషి, సయామీ ఖేర్ ప్రధాన పాత్రల్లో అభినయించారు.
కట్ చేస్తే.. `బ్రీత్ః ఇన్ టు ద షాడోస్`కి కొనసాగింపుగా ఇప్పుడు మరో సీజన్ రాబోతోంది. `బ్రీత్`, `బ్రీత్ః ఇన్ టు ద షాడోస్`ని డైరెక్ట్ చేసిన మయాంక్ శర్మనే ఈ నయా సీజన్ ని కూడా రూపొందిస్తున్నారు. కాగా, తాజాగా ఈ కొత్త సీజన్ కి సంబంధించిన చిత్రీకరణ దిల్లీలో ప్రారంభమైంది. గత సీజన్ ల కంటే మిన్నగా, ఆసక్తికరంగా ఇది ఉంటుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు.. 2022లో `బ్రీత్` కొత్త సీజన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుందని సమాచారం. మరి.. `బ్రీత్`, `బ్రీత్ః ఇన్ టు ద షాడోస్`కి మించి ఈ సీక్వెల్ సిరీస్ ఎంటర్టైన్ చేస్తుందేమో చూడాలి.
Also Read