అమరన్ ఫస్ట్ డే కలెక్షన్స్..మూడవ సినిమాగా రికార్డు
on Nov 1, 2024
శివ కార్తికేయన్(siva karthikeyan)సాయి పల్లవి(sai pallavi)జంటగా దివాలి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్. ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుపోతుంది.
తొలి రోజు ఈ మూవీ తమిళనాడులో పదహారు కోట్ల ఎనిమిది లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో నాలుగుకోట్ల ఐదు లక్షలు,కర్ణాటక లో కోటి తొమ్మిది లక్షలు,కేరళలో కోటి తొమ్మిది లక్షలు,రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఆరు లక్షలు ఇలా టోటల్ గా ఇండియా వైడ్ గా తొలి రోజు ఇరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఓవర్ సీస్ లో తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి టోటల్ గా ముప్పై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి శివ కార్తికేయన్ సినీ చరిత్రలోనే హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిల్చింది.
తమిళనాడులో నే తొలి రోజు కలెక్షన్స్ ని సాధించిన మూడవ సినిమాగా కూడా అమరన్ నిలిచింది.మొదటి రెండు స్థానాల్లో గోట్, వెట్టయ్యన్ లు ఉన్నాయి. రామస్వామి పెరియార్(rama swami periyar)దర్శకత్వంలో వచ్చిన అమరన్ ని కమల్ హాసన్(kamal haasan)నిర్మించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
