అల్లు అర్జున్ విదేశాలకి వెళ్ళవచ్చు
on Jan 11, 2025
పుష్ప 2(Pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో అల్లు అర్జున్(Allu Arjun)పై పోలీసు కేసు నమోదయిన విషయం తెలిసిందే.ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లడం,హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఆ తర్వాత నాంపల్లి కోర్టు పూచీకత్తుతో కూడిన రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం తెలిసిందే.కాకపోతే ప్రతి ఆదివారం పోలీసుల విచారణకు హాజరవ్వాలని కూడా తన తీర్పులో స్పష్టం చేసింది.
కానీ భద్రత కారణాల దృష్ట్యా ప్రతి ఆదివారం విచారణకి హాజరు కాలేనని అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసాడు.దీంతో విచారించిన కోర్టు పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలన్న నిబంధన నుండి మినహాయింపుని ఇస్తు తన తీర్పుని ప్రకటించింది.విదేశాలకు వెళ్లేందుకు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు.రేపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఈ రోజే తీర్పు రావడం గమనార్హం.
ఇక అల్లు అర్జున్ పుష్ప 2 తో రికార్డు కలెక్షన్స్ ని సృషించాడు. హిందీ లో అయితే ఏకంగా అక్కడి హీరోలకి కూడా సాధ్యం కానీ రీతిలో కలెక్షన్స్ ని సృష్టిస్తున్నాడు. రీసెంట్ గా ముంబై వెళ్లి భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు సంజయ్ లీల బన్సాలీని కలవడం ఇప్పుడు ఇండియా సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
Also Read