అది ఉంటేనే నా వీడియోలు చూస్తారా అంటున్న సదా!
on Apr 3, 2024
ఏదీ ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవరికి తెలియదు. సెలెబ్రిటీలు కొందరు కావాలని కంటెంట్ కోసం వ్లాగ్స్ చేస్తుంటే.. మరికొందరు కొన్ని ముఖ్యమైన విషయాలు అందరికి తెలియాలని చేస్తున్నారు. సదా తన యూట్యూబ్ ఛానెల్ లో పెళ్ళి గురించి మాట్లాడిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక ఆ తర్వాత తను చేసిన వీడియోలకి వ్యూస్ తగ్గిపోయాయి. దాంతో తను మరో వ్లాగ్ చేస్తూ తన ఆవేదనని తెలిపింది.
సదా.. ఎవర్ గ్రీన్ బ్యూటీ. తెలుగులో 'జయం' మూవీతో ఇండస్ట్రీలో అందరి చూపుని తనవైపు తిప్పుకున్న ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మరింత క్రేజ్ ని సొంతం చేసుకుంది. సదా జంతు ప్రేమికురాలు.. నేచర్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టంతో తను వీకెండ్స్ లో ఫారెస్ట్ కి వెళ్ళి తన ఫోటోగ్రఫీ స్కిల్స్ ని ఉపయోగిస్తుంది. ఎక్కువగా గ్రీనరిని ఇష్టపడుతుంది. తన హోమ్ టూర్ వ్లాగ్ చేసింది. అందులో కూడా తన ఇంటిని కంప్లీట్ గ్రీనరీగా మార్చినట్టు చెప్పిన సదా.. తనకి అలాగ ఉంటేనే ఇష్టమని ఆ వ్లాగ్ లో చెప్పింది.
సదా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా 'జయం' మూవీని చెప్పొచ్చు. జయం సినిమా వచ్చి దాదాపు 20 సంవత్సరాలు దాటినా అప్పటికి ఇప్పటికి తరగని అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది సదా. ఆ తర్వాత వచ్చిన అపరిచితుడు, ప్రియసఖి, సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలని చేసింది. ఎప్పుడు గ్రీనరిని కోరుకునే సదా.. 'సదాస్ గ్రీన్ లైఫ్' పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అయితే రీసెంట్ గా సదా తన సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టింది. బిబి జోడీకి హోస్ట్ గా చేసింది. ఇప్పుడేమో సూపర్ జోడీకి జడ్జ్ గా చేస్తూ బిజీ అయింది సదా.. ఆయితే ఇప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ లో చేసిన ' డ్రామా ఉంటేనే నా వీడియోలు చూస్తారా ' అంటు ఓ వ్లాగ్ చేసింది. అందులో మాట్లాడుతూ.. బ్యూటీ టిప్స్, జర్నీ వీడియో, షూటింగ్ అన్నీ చెప్తే ఎవరూ చూడట్లేదు. కానీ ఏదైనా డ్రామా ఉంటేనే చూస్తున్నారు. అంటే సంథింగ్ ఏదో ఒకటి ఉంటేనే జనాలు చూస్తారా.. డ్రామా లేకుంటే చూడరా అని చెప్పుకొచ్చింది సదా.. కాగా ఈ వ్లాగ్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read