ఇంద్రజకు సుధీర్ లేని లోటు తెలుస్తోంది!
on Jun 27, 2022
బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోస్ కి వచ్చే జడ్జెస్ లో ఇంద్రజ చాలా పద్ధతిగా చక్కగా వ్యవహరిస్తూ ఉంటారు. ఫస్ట్ లో గెస్ట్ గా వచ్చిన ఇంద్రజ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో ద్వారా ఫుల్ టైం జడ్జిగా మారిపోయారు. సుడిగాలి సుధీర్ ఇంద్రజని "అమ్మ అమ్మ" అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడు. 'సాఫ్ట్ వేర్ సుధీర్' మూవీలో సుధీర్ కి తల్లి పాత్రలో ఇంద్రజ నటించారు. ఇక అప్పటినుంచి తనను అమ్మ అంటూ పిలుస్తుంటాడు సుధీర్. వీళ్ళను చూస్తే నిజమైన తల్లీకొడుకుల్లానే అనిపిస్తారు. ఐతే తాజాగా ఇంద్రజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన గురించి తప్ప ఎవరి పర్సనల్ లైఫ్ విషయాలు అడగొద్దని ముందుగా యాంకర్ కి చెప్పేసి కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ చెప్పారు.
జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడం చాలా బాధ కలిగించిందని చెప్పారు. సుధీర్ ని తాను సిద్ధూ అని పిలుస్తానని చెప్పారు. ఇంద్రజ తనను ఇంట్లో అందరూ ముద్దుగా రాజి అని పిలిచినట్టే సుధీర్ కూడా తనను అలా పిలుస్తాడని అన్నారు. ఇక ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకు అంటూ మురిసిపోయారు. ఆమె ప్రవీణ్ కి వాచ్ కూడా బహుమతిగా ఇచ్చానని చెప్పారు. అమ్మ అని పిలిపించుకుంటే చాలా హాయిగా ఉంటుందన్నారు ఇంద్రజ.
ఇక ఇంద్రజ తన పర్సనల్ లైఫ్ విషయాల్ని కూడా చెప్పారు. తన పిల్లల పెళ్లిళ్ల విషయం పూర్తిగా వాళ్ళ ఇష్టమనీ, అందులో తాను ఇన్వాల్వ్ కానని చెప్పారు. పెళ్ళికి ముందే తన భర్త గురించి పూర్తిగా స్టడీ చేసి అన్ని విధాలుగా తనతో సంతోషంగా ఉంటానని తెలుసుకున్నాకే పెళ్లి చేసుకున్నానని చెప్పారు ఇంద్రజ. ఇక తన భర్త తమిళ్ లో కొన్ని సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నారని చెప్పారు. కొన్ని మూవీకి స్క్రిప్ట్ కూడా రాశారని చెప్పారు. కానీ ఇద్దరూ కలిసి మాత్రం పనిచేయలేదని చెప్పారు.