Home

»

Latest News

ప్రముఖ నటుడు ముక్కురాజు మృతి

Jul 31, 2014

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు సాగిరాజు రాజంరాజు (ముక్కు రాజు) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు.కొరియోగ్రాఫర్గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన పలు చిత్రాలలో అనేక పాత్రలు పోషించారు. ఆర్. నారాయణమూర్తి తీసే సినిమాల్లో దాదాపు ప్రతి దాంట్లోనూ ముక్కురాజు పాట లేదా పాత్ర తప్పనిసరిగా కనిపిస్తుంటాయి. ఆయన స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శుక్రవారం నాడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ముక్కురాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com