మదర్స్ డే కానుకగా ఫ్రీగా ఈ సినిమా చూసేయండి..కాకపోతే రెండు రోజులే
on May 10, 2025
.webp)
నివేతా థామస్(Nivetha thomas)అరుణ్ దేవ్(Arun Dev)జంటగా గత ఏడాది సెప్టెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ '35 చిన్నకథ కాదు'(35 Chinna Katha Kaadu). ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, అభయ్ శంకర్ కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్తేర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించగా, నంద కిషోర్ దర్శకుడిగా వ్యవహరించాడు.
ఇప్పుడు ఈ మూవీ మే 11 మదర్స్ డే (Mothers Day)కానుకగా 10 ,11 తేదీల్లో ప్రముఖ ఓటిటి మాధ్యమం 'ఆహా'(Aha)ద్వారా ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ ఆహా సంస్థ అధికారంగా ప్రకటించడంతో పాటు ఈ రోజు,రేపు మాత్రమే ఉచితంగా చూసే అవకాశం ఉంటుందని కూడా సదరు సంస్థ తెలిపింది. తిరుపతి టౌన్ నేపథ్యంలో జరిగే కథ కావడంతో ప్రేక్షకులకి ఈ మూవీ సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
కథ విషయంలోకి వెళ్తే బాలసరస్వతి అనే గృహిణికి చదువు ఉండదు. తన పెద్ద కొడుకు అరుణ్ లెక్కల్లో వెరీ పూర్. మాస్టర్స్ ఎంత చెప్పినా కూడా అరుణ్ మైండ్ కి ఎక్కదు. దీంతో స్కూల్ మాస్టర్ నుంచి పిల్లలు దాకా అందరు అరుణ్ ని జీరో అంటు ఎగతాళి చేస్తుంటారు. ఈ క్రమంలో అరుణ్ స్కూల్ లో ఉండాలంటే పరీక్షలో 35 మార్కులు రావాల్సి ఉంటుంది. దీంతో చదువు రాని సరస్వతి చదువు నేర్చుకొని తన కొడుకు అరుణ్ కి 35 మార్కులు వచ్చేలా చేస్తుంది. ఈ క్రమంలో జరిగే కథనాలు మొత్తం ఎంతో హృద్యంగా ఉండటమే కాకుండా తల్లి ప్రేమని కూడా చాటి చెప్తాయి. నటీ నటులందరు ఎంతో అత్యద్భుతంగా చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



