Home

»

Latest News

Anna lezhneva: ఒకరి బర్త్ డే, మరొకరికి పునర్జన్మ 

Apr 08, 2026

 

-పవన్ వైఫ్ అన్నాలెజినోవా పోస్ట్ 
-నిమిషాల్లోనే వైరల్ 
-సంఘటనని గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark shankar)సింగపూర్ లోని తన స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. అసలు ఆ ప్రమాద వార్త విన్నప్పుడు ఫాన్స్ తో పాటు అందరు ఎంతో ఆందోళనకి గురయ్యారు. మరి పవన్, అన్నా లెజినోవాల టెన్షన్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ సంఘటన జరిగి నేటికీ ఏడాది. అంటే ఏప్రిల్ 8 2025 న జరిగింది. ఇదే రోజు పవన్ పెద్దకొడుకు అకిరా నందన్(Akira Nandan)పుట్టిన రోజు. ఈ రెండు అంశాలని ముడి చేస్తూ అన్నా లెజినోవా రీసెంట్ గా చేసిన పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరి హృదయాల్ని స్పృశిస్తుంది. ఆ పోస్ట్ ఏంటో చూద్దాం

ఏడాది క్రితం ఈ రోజునే మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకోవడంతో మా కుటుంబం వణికిపోయింది. దేవుడి దయ వల్ల ఆ సంఘటన నుంచి మార్క్ బయట పడటం మా అదృష్టం. ఆ రోజు హాస్పిటల్ లో మార్క్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఒక తల్లిగా ఎంత నరకయాతన అనుభవించానో నాకు తెలుసు. ఏ తల్లికి అలాంటి పరిస్థితి రాకూడదు. ఇదే రోజు మా పెద్దబ్బాయి అఖీరా నందన్ పుట్టిన రోజు. మార్క్ కి పునర్జన్మ. అందుకే మా ఇద్దరి అబ్బాయిల విషయంలో ఈ రోజుని సెలెబ్రేట్ చేసుకుంటామని ఇనిస్టా వేదికగా తెలిపింది.

Also read: Janhvi Kapoor: నా బుర్రని వాడేదాన్ని కాదు.. సంబంధం లేని వ్యక్తులు తగిలారు 


మార్క్ శంకర్ స్కూల్ ప్రమాదం కేసు తాలూకు దర్యాప్తు ఇంకా కొసాగుతూనే ఉంది. ఆ ప్రమాదంలో పదేళ్ల వయసున్న ఒక చిన్నారి చనిపోగా, మార్క్ తో కలిసి పద్దెనిమిది మంది పిల్లలు అస్వస్ధతతో హాస్పిటల్ పాలయ్యారు. 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com