
-ఎన్టీఆర్ ఎంతో అభిమానం
-ఆయన ఒక శక్తి కూడా
-తనతో మాత్రమే అన్ని షేర్ చేసుకుంటాను
మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)ప్రస్తుతం 'డ్రాగన్'(Dragon)చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ లుక్ తో పాటు షూటింగ్ షెడ్యూల్స్ కి సంబంధించి కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్న రూమర్స్ ని నమ్మవద్దని మేకర్స్ కాసేపటి క్రితమే ఒక ప్రకటన చేసారు. సదరు న్యూస్ సోషల్ మీడియాలో కొద్దిగా కుదురుకుంటు ట్రెండ్ అవుతున్న టైంలో ఎన్టీఆర్ గురించి ప్రముఖ నటి మమతా మోహన్(Mamta Mohandas)దాస్ చెప్పిన మాటలు నయా ఎన్టీఆర్ ట్రెండ్స్ లోకి వచ్చింది. దీంతో రెండు న్యూస్ మధ్య హెల్ది పోటీ నెలకొని ఉంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
మమతా మోహన్ దాస్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఎన్టీఆర్ నా అభిమాన వ్యక్తి. నటుడిగానే కాకుండా, ఒక అద్భుతమైన వ్యక్తిగా, శక్తిగా భావిస్తాను. ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎన్టీఆర్ తో మాత్రమే నా బాధలని పంచుకుంటాను. నాలాగానే ఎన్టీఆర్ కి నాకు సంగీతం పట్ల విపరీతమైన ప్రేమ ఉంది. మా ఇద్దరి మధ్య బలమైన బంధానికి కూడా అదే కారణం. మేము ఎప్పుడైనా కలిస్తే యో వాట్స్ అప్ అని పలకరించుకుంటాం. సంవత్సరాలు గడుస్తున్నా ఆ అనుబంధంలో ఎలాంటి మార్పు రాలేదు. నేను ఒకసారి యూఎస్‌లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ నుంచి సడన్ గా ఫోన్ వచ్చింది. రాండమ్‌గా కాల్ చేశాను అని చెప్పాడు. దీన్ని బట్టి మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏ పాటిదో తెలుసుకోవచ్చని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చింది.
Also read: Raakaa: అల్లు అర్జున్, అట్లీ మూవీ టైటిల్ ఇదే
ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్ కలిసి యమదొంగ(Yamadonga)లో జంటగా చేసారు. జంటగా చేసారు అనే కంటే తమ చిలిపి అల్లరితో సిల్వర్ స్క్రీన్ తన జన్మ ధన్యమైందని మురిసిపోయేలా చేసారు. మమతా మోహన్ దాస్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ కూడా.సింగర్ గాను పలు చిత్రాల్లో పాటలు పాడి గొంతుకి కూడా స్టార్ డమ్ తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ క్యాన్సర్ తో పోరాడి కోలుకుంది. తన స్వస్థలం పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉన్న బహ్రయిన్. పేరెంట్స్ మళయాళీస్.







