Home

»

Latest News

‘జననాయగన్‌’ ఎఫెక్ట్.. చిరంజీవి, బాబీ సినిమా వాయిదా!

Apr 10, 2026

దళపతి విజయ్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘జననాయగన్‌’ చిత్రం ఇప్ప్పుడు కష్టాల్లో పడింది. ఈ చిత్రం టోట‌ల్‌గా లీక్ అయింది. అది కూడా హెచ్‌డి ప్రింట్ ఆల్‌లైన్‌లోకి వచ్చేసింది. దీంతో చిత్ర యూనిట్ షాక్‌కి గురైంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా సెన్సార్ సమస్యల కారణంగా రిలీజ్ సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చెయ్యలేదు.

ఇప్ప్పుడు సినిమా లీక్ అవ్వడం ఈ చిత్రాన్ని నిర్మించిన కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. దానికి సంబంధించిన సమస్యను పరిష్కరించుకునేందుకు చిత్ర యూనిట్ కషి చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇదే బేనర్‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాను ఏప్రిల్ 11న లాంచ్ చెయ్యాలని భావించారు. అయితే ఇప్ప్పుడు జననాయగన్ లీక్ వ్యవహారంలో నిర్మాణ సంస్థ తలమునకలై ఉండడంతో ప్రస్తుతానికి చిరంజీవి, బాబీ చిత్ర ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. 

తెలుగులో నందమూరి బాలకష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ ఆధారంగా ‘జననాయగన్‌’ చిత్రాన్ని రీమేక్ చేశారు. అయితే స్టోరీ లైన్ తీసుకొని దాన్ని తమిళ నేటివిటీకి, విజయ్ ఇమేజ్‌కి సరిపోయేట్టుగా మార్పులు, చేర్పులు చేశారని తెలుస్తోంది. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో పూర్తి సినిమా అందుబాటులోకి రావడం ఇప్పటివరకు మనం చూశాం. కానీ, ఒక సినిమా రిలీజ్ అవ్వకుండానే హెచ్‌డి ప్రింట్ ఆన్‌లైన్‌కి వచ్చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com