Home

»

Latest News

Thimmarajupalli TV Trailer: 'తిమ్మరాజుపల్లి టీవీ' ట్రైలర్.. టీవీ ఎంత పని చేసింది!

Apr 09, 2026

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నిర్మాతగా మారి, క ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన మూవీ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmarajupalli TV). మునిరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఒక టీవీ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ఈ సినిమా ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే వింటేజ్ డ్రామాగా కనిపిస్తోంది. ఊర్లోకి మొదటిసారి 'టీవీ' రావడం, ఆ టీవీ చుట్టూ జరిగే రాజకీయం, పంతాలు, వినోదాన్ని ఇందులో చూపించారు.

ట్రైలర్ ప్రారంభం నుంచే పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే వైషమ్యాలను చాలా నేచురల్ గా చూపించారు. ఊరి జనం అంతా చందాలు వేసుకుని శివరాత్రి పండుగ కోసం సతీష్ అనే వ్యక్తి ద్వారా ఊరికి టీవీని తెప్పిస్తారు. ఆ టీవీలో ఏ సినిమా చూడాలి అనే దానిపై ఊరి జనాల మధ్య జరిగే సరదా సంభాషణలు ఆకట్టుకుంటాయి.

ఊరి పెద్దగా చలామణి అయ్యే రాజప్ప.. సతీష్ టీవీ తీసుకురావడాన్ని తన గౌరవానికి భంగంగా భావిస్తాడు. "ఊర్లో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని" అనే ఇగో అతని పాత్రలో కనిపిస్తుంది. టీవీ రాకతో ఊర్లో మనుషుల మధ్య గొడవలు మొదలవుతాయి. ముఖ్యంగా సాయి తేజ్, వేధ జలంధర్, వి. మునిరాజు పోషించిన పాత్రల మధ్య సాగే డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. “వచ్చే శివరాత్రి లోపల టీవీకి సంబంధించిన వాళ్ళని తెచ్చి పంచాయతీ పెట్టకపోతే.. ఒంటి మీద నూలుపోగు లేకుండా తిరుగుతా” అంటూ సాగే డైలాగ్స్ సినిమాలోని ఘర్షణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 

ట్రైలర్ లో గమనిస్తే, తిమ్మరాజుపల్లి అనే ఊరికి టీవీ రావడం అనేది ఒక పెద్ద సెలబ్రేషన్ లా చూపించారు. అయితే, అదే టీవీ వల్ల ఊరి పెద్దలకు, హీరోకి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? రాజప్ప అనే పాత్రతో హీరోకి ఉన్న వైరం ఏమిటి? అనే విషయాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఒక సాధారణ టీవీ మనుషుల మధ్య ఎలా చిచ్చు పెట్టింది అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

సాయి తేజ్ పల్లెటూరి యువకుడిగా సహజంగా కనిపిస్తున్నాడు. ట్రైలర్‌లో విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ట్రైలర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. 

మొత్తానికి, ఒక చిన్న పల్లెటూరిలో టీవీ ఎంతటి మార్పులు తెచ్చింది, అది ఆ ఊరి మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది అనే పాయింట్‌తో ఈ సినిమా ఆసక్తికరంగా సాగనుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com