Home

»

Latest News

హాలీవుడ్‌కి షిఫ్ట్ అయిన స‌న్నీ లియోన్‌.. షెరీఫ్‌గా కొత్త లుక్‌!

Apr 04, 2026

బాలీవుడ్ సెన్సేషన్ సన్నీ లియోన్ తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇన్నాళ్లూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై తన గ్లామర్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. సన్నీ లియోన్ తాజాగా ఒక క్రేజీ అమెరికన్ ఓటీటీ సిరీస్‌లో కీలక పాత్రకు సంతకం చేసింది. 'ది జెయింట్' (The Giant) పేరుతో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో సన్నీ మునుపెన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతోంది.

ఈ సిరీస్‌లో సన్నీ లియోన్ కేవలం అతిథి పాత్రకో లేదా గ్లామర్ రోల్‌కో పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే 'రిజర్వేషన్ షెరీఫ్ క్వానా డీర్లీఫ్' అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తోంది. కెవిన్ బి ప్లాత్ ఈ సిరీస్‌ను క్రియేట్ చేయడంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆర్టెమిస్ థియేట్రికల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రతి సీజన్‌లో అరగంట నిడివి గల ఆరు ఎపిసోడ్లు ఉండేలా పక్కా ప్లానింగ్‌తో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు.

ఈ సరికొత్త ప్రయాణం గురించి సన్నీ లియోన్ స్పందిస్తూ.. తన కెరీర్‌లో ఇది చాలా ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. "నేను ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది పూర్తి భిన్నమైనది. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం, ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్‌ను పోషించడం నాకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ ప్రయాణం కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. అభిమానులకు కూడా నా కొత్త అవతార్ ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది" అని సన్నీ ఆశాభావం వ్యక్తం చేసింది.

సన్నీ లియోన్ ప్రయాణాన్ని గమనిస్తే, ఆమె కేవలం ఐటమ్ సాంగ్స్, గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రల వైపు మొగ్గు చూపుతోంది. గత ఏడాది అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'కెన్నెడీ' చిత్రంలో ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ఈ సినిమా సందడి చేయడంతో సన్నీకి హాలీవుడ్ అవకాశాలు క్యూ కట్టాయి. ఆ క్రమంలోనే 'ది జెయింట్' ప్రాజెక్ట్ ఆమె ఖాతాలో చేరింది.

ఈ హాలీవుడ్ సిరీస్‌లో వైవిధ్యానికి పెద్దపీట వేశారు. లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్ మరియు ఏషియన్ నటీనటులతో ఒక మల్టీ కల్చరల్ కాస్టింగ్‌ను సెట్ చేశారు. ప్రస్తుతం అమెరికన్ స్ట్రీమింగ్ మార్కెట్‌లో క్యారెక్టర్ డ్రివెన్ కథలకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను హై స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారు. సన్నీ ఇందులో షెరీఫ్ డ్రెస్ వేసి తుపాకీ పట్టుకుని చేసే యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా సన్నీ సుపరిచితమే. ఇటీవల వచ్చిన 'త్రిముఖ' వంటి సినిమాలతో పాటు పలు స్పెషల్ సాంగ్స్ ద్వారా ఇక్కడ భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇప్పుడు నేరుగా హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో అది కూడా ఒక పవర్ ఫుల్ ఆఫీసర్‌గా కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెకు ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు. 'గ్లామర్ నుంచి యాక్షన్ వైపు సన్నీ రూటు మార్చింది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న 'ది జెయింట్' సిరీస్ షూటింగ్ పూర్తికాగానే ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు సన్నీ చేతిలో రంగీలా, వీరమహాదేవి, షేరో వంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. హాలీవుడ్ ఎంట్రీతో సన్నీ రేంజ్ గ్లోబల్ లెవల్‌కు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com