Home

»

Latest News

VV Vinayak: అల్లు అర్జున్ ఎదుగుదల వెనుక సీక్రెట్.. 'బద్రీనాథ్' రిజల్ట్ పై వినాయక్ షాకింగ్ కామెంట్స్!

Apr 09, 2026

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ అనగానే గుర్తొచ్చే పేర్లలో వి.వి. వినాయక్ (VV Vinayak) ముందు వరుసలో ఉంటారు. తాజాగా 'తెలుగువన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినాయక్ తన సినీ ప్రయాణం గురించి, ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎదుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బన్నీ ఈ స్థాయికి వెళ్తాడని తాను ఎప్పుడో ఊహించానని ఆయన చెప్పడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఠాగూర్ టైమ్ లోనే బన్నీని చూసి..
మెగాస్టార్ చిరంజీవితో తాను 'ఠాగూర్' సినిమా చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ ఇంకా హీరో కాలేదని గుర్తు చేసుకున్నారు. అప్పుడప్పుడే 'గంగోత్రి' సినిమా కోసం ప్రయత్నాలు మొదలయ్యాయని, అప్పుడు బన్నీ ఒక చిన్న పిల్లోడిలా ఉండేవాడని చెప్పారు. కానీ అప్పటికే బన్నీలో ఏదో సాధించాలనే తపన ఉండేదని, ఆ చిన్న వయసులోనే తన అబ్జర్వేషన్ బాగుండేదని వినాయక్ కొనియాడారు. ఇప్పుడు బన్నీ ఎదిగిన తీరు చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

బద్రీనాథ్ కలెక్షన్స్ పై క్లారిటీ
అల్లు అర్జున్ తో వినాయక్ 'బన్నీ', 'బద్రీనాథ్' వంటి సినిమాలు చేశారు. అయితే 'బద్రీనాథ్' సినిమాపై ఉన్న కొన్ని విమర్శల గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు. పక్కన ఉన్న పెద్ద సినిమాలతో కంపేర్ చేసినప్పుడు ఆ సినిమా రిజల్ట్ గురించి జనం ఏమైనా అనుకోవచ్చు కానీ, అప్పట్లో బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ రెవెన్యూ రాబట్టిన సినిమా అదేనని వినాయక్ స్పష్టం చేశారు. అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల కొంతమందికి అలా అనిపించి ఉండొచ్చు కానీ, అది బాగా రెవెన్యూ చేసిందని ఆయన పేర్కొన్నారు.

అపజయాలను తట్టుకోవడం కష్టమే..
సినిమా హిట్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తానో, ఫ్లాప్ అయితే అంతగా కుంగిపోతానని నిజాయితీగా వినాయక్ ఒప్పుకున్నారు. 'చెన్నకేశవరెడ్డి' విడుదలైనప్పుడు మొదటి మూడు నాలుగు రోజులు భోజనం కూడా చేయలేదని అన్నారు. ఆ తర్వాత సినిమా పుంజుకోవడంతో మళ్ళీ నార్మల్ అయ్యాయని తెలిపారు. అలాగే 'యోగి', 'అఖిల్', 'ఇంటెలిజెంట్' వంటి సినిమాల రిజల్ట్ కూడా తనను బాగా బాధించాయని, అపజయాలను హ్యాండిల్ చేయడం తనకు ఇప్పటికీ రాదని ఆయన అన్నారు.

వినాయక్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి?
ప్రస్తుతం వినాయక్ మళ్ళీ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నారు. రెండు ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతున్నాయని, కానీ తనను ఎగ్జైట్ చేసే పాయింట్ దొరికితేనే వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో 'యానిమల్', 'లోకా', 'లక్కీ భాస్కర్', 'ధురంధర్', 'పుష్ప' వంటి సినిమాలు తనను బాగా ఆకట్టుకున్నాయని వినాయక్ తెలిపారు. 

వి.వి. వినాయక్ ఫుల్ ఇంటర్వ్యూ కోసం, మరిన్ని ఆసక్తికర సినిమా విశేషాల కోసం మా తెలుగువన్(TeluguOne) ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com