
-వీడియో రిలీజ్ చేసిన నెమలి
-నిమిషాల్లోనే వైరల్
-ఏం మాట్లాడిందో చూద్దాం
క్యాస్టింగ్ కౌచ్.. ఈ మాట వినపడగానే చాలు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది ఎవరు? అందుకు కారణమైన వాళ్ళు ఎవరని ఎంతో ఆసక్తితో ఆ వివరాలన్నీ వినడం సినీ ప్రియుల, నెటిజన్స్ నిత్యదిన చర్యలో ఒక భాగమైంది. మరి రీసెంట్ గా ఆ ఆరోపణలు చేసింది ఎవరో చూద్దాం.
'పీకు నెమలి(Piku nemali)న్యూయార్క్ కి చెందిన నెమలి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. తను రీసెంట్ గా ఒక వీడియో విడుదల చేసింది. అందులో ఆమె మాట్లాడుతు టాలీవుడ్‌లో అవకాశాల కోసం పరిచయస్తుల ద్వారా ఒక సహాయ దర్శకుడిని సంప్రదించి నా పోర్ట్‌ఫోలియో పంపాను. స్టార్టింగ్ లో బాగానే మాట్లాడిన సహాయ దర్శకుడు ఆ తర్వాత నాతో భారత్‌లోని ఒక రిసార్ట్‌కి రావాలని, అక్కడ ఒక ప్రముఖ నిర్మాతని కలవాలని తప్పుగా మాట్లాడాడు. దీంతో షాక్ కి గురయ్యాను. ఇలాంటి పరిస్థితుల వల్ల చాలా మంది ప్రతిభావంతులైన అమ్మాయిలని ఇండస్ట్రీలోకి రానివ్వకుండా వెనక్కి వెళ్లేలా చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ళని పేర్లని మాత్రం నెమలి వెల్లడి చెయ్యలేదు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారడంతో పలువు స్పందిస్తు కొంత మంది వల్ల తెలుగు కళామతల్లి సిగ్గుపడుతుందని వాళ్ళకి బుద్దిచెప్పేలా కఠినమైన నిర్ణయాలని సినీ పెద్దలతో పాటు ప్రభుత్వాలు తీసుకురావాలని కోరుతున్నారు.
Also read: Biker vs rakasa: ఫస్ట్ డే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ ఇదే
ఈ విషయంపై ప్రముఖ నటి, యాంకర్, లైంగిక వేధింపుల నివారణ కమిటీలో సభ్యురాలైన ఝాన్సీ మాట్లాడుతు నెమలి చెప్పిన విషయాన్నీ సీరియస్‌గా తీసుకుంటామని, అవసరమైన సహాయం అందించడంతో పాటు సదరు అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపారు. ఈ మేరకు నెమలితో ఝాన్సీ నేరుగా మాట్లాడటం విశేషం.






