Home

»

Latest News

NBK 111  గ్లింప్స్‌ రిలీజ్.. స్పెషల్ ఇదే

Jun 10, 2026 6:08PM


గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహ నందమూరి బాలకృష్ణ(Balakrishna)పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి  అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ అందింది. బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలవబోతున్న 111వ చిత్రం (NBK 111) నుంచి మేకర్స్ సరికొత్త అఫీషియల్ గ్లింప్స్‌ని  విడుదల చేశారు. 


 గ్లింప్స్‌లో బాలకృష్ణ  మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త స్టైలిష్ అండ్ ఇంటెన్స్ అవతారంలో చూపించి డైరెక్టర్ గోపీచంద్ మలినేని అందరినీ ఆశ్చర్యపరిచారు 1993 ముంబై నేపథ్యంలో  రొటీన్ తెలుగు కమర్షియల్ సినిమాలకి  భిన్నంగా మోడరన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోందని గ్లింప్స్‌ ద్వారా  అర్థమవుతోంది. "నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్" అనే క్యాప్షన్‌కు పర్‌ఫెక్ట్ న్యాయం చేస్తూ బాలయ్య లుక్‌ని  డిజైన్ చేశారు. . డార్క్ టోన్ సినిమాటోగ్రఫీ, సీరియస్ మోడరన్ వైబ్స్  గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బాలయ్య మార్క్ హై-వోల్టేజ్ మాస్ ఎనర్జీని ఏమాత్రం తగ్గించకుండానే, హాలీవుడ్ స్టైల్ మేకింగ్ వాల్యూస్‌తో ఉన్న యాక్షన్ సీక్వెన్స్  ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. థమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెస్మరైజ్ చేయనున్నాడనే విషయం అర్ధమవుతుంది.

Also read: Anil ravipudi: వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ.. కీలక అప్ డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి

గతంలో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో  వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు రాబోతున్న ఈ 111వ సినిమాపై అటు నందమూరి అభిమానుల్లో  సాధారణ ప్రేక్షకుల్లో  క్యూరియాసిటీ నెలకొంది. అందుకు తగ్గట్టే విడుదలైన నిమిషాల్లోనే  గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో రికార్డు వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది.

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com