Home

»

Latest News

Vijay Antony: వంద దేవుళ్ళు .. ఆసక్తికరంగా మారిన వ్యాఖ్యలు 

Apr 06, 2026

-విజయ్ అంథోని నెక్స్ట్ ప్రాజెక్ట్ వంద దేవుళ్ళు 
-ఈ సారి హిట్ అందుకుంటాడా!
-టీజర్ లో ఏముంది


తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తెలుగు హీరోలే చోటు సంపాదించడానికి నానా సినీ అవస్థలు పడుతున్నారు. అలాంటిది తమిళ హీరో విజయ్ అంథోని(Vijay Antony)దశాబ్దం నుంచే తెలుగు ప్రేక్షకుల హార్ట్స్ లో చోటు సంపాందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు తమిళ హీరో అని ఇంట్రడ్యూస్ చేద్దామన్నా ఆ విషయంలో ఎప్పుడో చేయి దాటి పోయింది. గత ఫిబ్రవరిలో 'బూకీ' కి విజయ్ మ్యూజిక్ ని అందించాడని తెలియడంతో   తెలుగు ప్రేక్షకులు బాగానే తరలి వెళ్లారు. ఇప్పడు విజయ్ అంథోని  'వంద దేవుళ్ళు'(Vanda Devullu)అనే చిత్రంతో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యి రిలీజ్ రోజు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితిని మూవీ లవర్స్ కి కల్పించేలా ఉంది. డీటెయిల్స్ చూద్దాం 

సుమారు నిమిషం ముప్పై ఆరు సెకన్ల నిడివితో ఉన్న టీజర్ ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక గ్రామంలో మహిళ పట్ల జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిందనే విషయం అర్ధమవుతుంది. మేకర్స్ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు.  ఊరి వ్యక్తి మాట్లాడుతు  నేను మాత్రమే కాదండి. దీనిని ఎవరు అంగీకరించరు అని చెప్పడం, సదరు మహిళని ఊరివాళ్ళు చులకనగా చూడటం, మనం మన కులాన్ని కాపాడుకునేది ఆడవాళ్ళని అడ్డుపెట్టుకునే వంటి డైలాగ్ తో కథ ఏంటనే క్యూరియాసిటీ ఏర్పడింది. విజయ్ అంథోని రోల్ ని చేస్తే ఈ సారి వంద దేవుళ్ళు ద్వారా మెస్మరైజ్ చేడబోతున్నాడని తెలుస్తుంది. శ్వాసిక విజయ్, అజయ్ దిషాన్, శక్తీ కీలకమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు.


Also read: Ranveer singh: రణవీర్ సింగ్ అప్ కమింగ్ మూవీ ప్రళయ్.. ఆ పుస్తకంలోని కథేనా!

ఇక ఈ చిత్రం స్పెషల్ ఏంటంటే శశి కాంత్(SasiKanth)దర్శకుడు కావడం. శశికాంత్ ఎవరో కాదు విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గా నిలిచిన బిచ్చగాడు దర్శకుడు. సదరు బిచ్చగాడు తర్వాత ఆ ఇద్దరి కాంబోలో వస్తున్న రెండో మూవీ. మరి ఎంత ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని తెరకెక్కించారో అర్ధం చేసుకోవచ్చు. రామాంజనేయులు జవ్వాజి తో కలిసి విజయ్ ఆంథోనీ నే నిర్మిస్తున్నాడు.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com