Home

»

Latest News

Anjali Nair: హైకోర్టుకి ప్రముఖ నటి అంజలి.. 120 సినిమాల్లో ఏ పేరు ఉంది

Apr 01, 2026

 

 

అంజలి హైకోర్టుకి వెళ్ళడానికి కారణం ఏంటి
అసలు పొరపాటు ఎక్కడ జరిగింది 
మరి విజయం సాదిస్తుందంటారా!


సినిమాకి, రాజకీయానికి మధ్య ఉన్న అనుబంధం రక్త సంబంధానికంటే ఎక్కువ అని చెప్పవచ్చు. మరి ఆ రెండిటి సుదీర్ఘ ట్రాక్ రికార్డు రక్త సంబంధం అనే వర్డ్ వాడటంలో ఎలాంటి తప్పులేదని చెప్తుంది. ఇక తెలుగు వారి చేత డైలీ మలయాళ సినిమా చూసేలా చేసే కేరళలో ఈ నెల 9 న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ప్రముఖ నటి అంజలి నాయర్(Anjali Nair) అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలో ఆమె రీసెంట్ గా కేరళ హైకోర్ట్ మెట్లు ఎక్కడం సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.


కేంద్ర ఎన్నికల సంఘం ముద్రించిన పేపర్స్ లో అంజలి నాయర్ పేరు ప్లేస్ లో అంజలి పి.వి.అని పేర్కొన్నారు. ఈ లెక్కన ఎలక్షన్స్ రోజున ఈవీఎంతో పాటు బ్యాలెట్ పేపర్ పై అదే పేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ విషయంపైనే ఆమె హైకోర్టులో పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో నేను ఓటర్లకి  'అంజలి నాయర్' అనే పేరుతోనే పరిచయం. 'అంజలి పి.వి.' అని ఉంటే నన్ను గుర్తుపట్టడం కష్టమవుతుంది. కాబట్టి అంజలి నాయర్ గా పేరు మార్చాలని తన పిటిషన్ లో పేర్కొంది. ఈ విషయంపై హైకోర్టు స్పందిస్తు  విచారణ జరిపి పూర్తి వివరాలు అందివ్వాలని  కేంద్ర ఎన్నికల అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేసింది.

Also read: Varanasi: స్వర్ణ దేవాలయంలో ప్రియాంక చోప్రా హల్ చల్.. వైరల్ అవుతున్న పిక్స్ 
 

1994 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన అంజలీ ఆనతికాలంలోనే ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా చేసి అశేష అభిమానఘనాన్ని పొందింది. దృశ్యం 2 తో పాటు ఎన్నో క్రేజీ చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి. మోహన్ లాల్(Mohan lal)అప్ కమింగ్ మూవీ 'రామ్' లో ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపిస్తుంది. తన లిస్ట్ లో మొత్తం120 చిత్రాల వరకు ఉండగా 'త్రిపునతురా' సెగ్మెంట్ నుంచి బీజేపీ నేతృత్వంలో ఉన్నTwenty20 Party నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.   

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com