Home

»

Latest News

Manasa Sharma: ఓయ్ హీరోయిన్‌ను తలపిస్తున్న లేడీ డైరెక్టర్.. ఎవరీ మానస శర్మ?

Apr 01, 2026

టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లేడీ డైరెక్టర్ మానస శర్మ(Manasa Sharma). డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ యువ దర్శకురాలు ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

'ఓయ్' హీరోయిన్ షామ్లీని గుర్తుచేస్తున్న లుక్:
నిహారిక కొణిదెల నిర్మాణంలో మానస శర్మ దర్శకత్వం వహించిన 'రాకాస'(Rakasa) చిత్రం ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మానస శర్మను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆమె అమాయకపు నవ్వు, సహజమైన తెలుగుదనం చూస్తుంటే ఒకప్పటి 'ఓయ్' హీరోయిన్ షామిలి గుర్తుకువస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఒక హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని లుక్, సింపుల్ స్టైల్‌తో ఆమె ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

రైటర్ టు డైరెక్టర్..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మానస శర్మ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. రైటర్ గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌కు పని చేసింది. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సిరీస్ కి రైటర్ గా వర్క్ చేసి మెప్పించింది. ఆ తర్వాత డైరెక్టర్ గా ఎదిగింది. 2024లో సోనీ లివ్‌లో విడుదలైన 'బెంచ్ లైఫ్' (Bench Life) వెబ్ సిరీస్ ద్వారా ఆమె దర్శకురాలిగా పరిచయమైంది. ఆ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

నిహారిక సపోర్ట్.. రాకాసతో రాక..
బెంచ్ లైఫ్' సిరీస్ తర్వాత, మరోసారి నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థలోనే 'రాకాస' సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం మానసకు దక్కింది. అంటే, నిర్మాత నిహారికకు ఆమె పనితీరు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో ఉన్న మానస శర్మ, 'రాకాస'తో వెండితెరకు డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ట్రైలర్ తో మంచి మార్కులు కొట్టేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ డైరెక్టర్ హీరోయిన్ లా ఉందంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com