
మలయాళ చిత్రాలకి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తెలిసిందే. అక్కడి కథల్లో ఉండే సహజత్వం, భావోద్వేగాలు మన ప్రేక్షకులని కూడా కట్టిపడేస్తుంటాయి.ఆ కోవలోనే గత నెల ఏప్రిల్ 23 న విడుదలైన మధువిధు (Madhuvidhu)క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. షరాఫుద్దీన్, కల్యాణి పణిక్కర్ జంటగా చేయగా విష్ణు అరవింద్ తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
ఈ నెల 22 న సోని లైవ్(Sony Live)వేదికగా స్ట్రీమింగ్ కానుంది. సదరు స్ట్రీమింగ్ విషయాన్నీ సోని లైవ్ సంస్థ అధికారకంగా ప్రకటించడంతో పాటు మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నట్టుగా తెలిపింది. 'ఆంజలమూడు' అనే ఫ్యామిలీలో కేవలం ఐదుగురు పురుషులు మాత్రమే ఉంటారు. మహిళా సభ్యులు లేని ఈ కుటుంబంలోకి కోడలిగా రావడానికి ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు. ఈ క్రమంలో కథానాయకుడు అమృత్ రాజ్ (షరాఫుద్దీన్) పెళ్లి సంబంధాలు ఏకంగా 28 సార్లు ఫెయిల్ అవుతాయి. చివరకు స్నేహ మార్కోస్ (కల్యాణి పణిక్కర్) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది.ఆ తర్వాత ఆ ఇద్దరి క్యారెక్టర్స్ ఎలాంటి మలుపులు తిరిగాయి? కామెడీ మరియు ఎమోషన్స్ కలగలిపిన ఈ ప్రయాణమే 'మధువిధు'.
Also read: Trisha: త్రిష ఒక పరన్నాజీవి.. గాయని సుచిత్ర షాకింగ్ కామెంట్స్
ఇంతకీ మధువిధు అంటే హనీమూన్. మరి మలయాళ చిత్రాలని ఇష్టపడే వాళ్ళు ఈ నెల 22 న సోనీ లైవ్ లో మధువిధు చూసి సినీ ఆనందాన్ని పొందండి.







