Home

»

Latest News

Trisha: త్రిష ఒక పరాన్న జీవి.. గాయని సుచిత్ర షాకింగ్ కామెంట్స్

May 11, 2026

 

దక్షిణాది సినీ పరిశ్రమలో 'సుచీ లీక్స్' పేరుతో ఒకప్పుడు సంచలనం సృష్టించిన గాయని సుచిత్ర(Suchitra)మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో సెలబ్రిటీల వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను లీక్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమె, తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ త్రిష,దళపతి విజయ్‌లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుచిత్ర మాట్లాడుతు త్రిష(Trisha)ఒక 'పరాన్నజీవి'. నాకు ఆమె అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ విజయ్ అంటే చాలా ఇష్టం. అందుకే నా అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా చెబుతున్నా. ప్రస్తుతం విజయ్(Vijay)తన కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఇలాంటి సమయంలోనే 'పరాన్నజీవుల' వంటి వ్యక్తులు విజయ్ జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని  అతన్ని వాడుకుంటూ భారంగా మారుతున్నారు అంటు చెప్పుకొచ్చింది.


Also read: Manchu Manoj: బండి భగీరథ్ వ్యవహారం.. స్పందించిన  మంచు మనోజ్ 

సుచిత్ర వ్యాఖ్యలపై త్రిష అభిమానులు మరియు విజయ్ రాజకీయ  మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా  స్పందిస్తు ఆధారాలు లేకుండా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం సంస్కారం కాదని హితవు పలుకుతున్నారు. మరి సుచిత్ర విషయంలో త్రిష ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com