
-కొన్ని కోట్ల మంది చేత ప్రేమించబడ్డ స్టార్
-అమెరికా అధ్యక్షుడైనా ఆమె ప్రోగ్రాం చూడాల్సిందే
-కానీ వ్యక్తి గత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు
-మరి నన్ను ఎవరు ప్రేమించలేక పోయారని ఎందుకు చెప్తుంది
-ఇంతకీ ఆమె ఆక్రందన ఏంటి
జెన్నిఫర్ లోపెజ్(Jennifer Lopez).. ప్రపంచ పాప్ మ్యూజిక్ రంగంలో తిరుగులేని అజమాయిషీ చెలాయించిన లెజండ్రీ. ఆమె ప్రోగ్రాం చేస్తుందంటే చాలు అమెరికా అధ్యక్షుడైనా తన పనులు సైతం పక్కన పెట్టి వీక్షించాల్సిందే. ఇక అభిమానులు గురించి అయితే చెప్పక్కర్లేదు తిండి తిప్పలు, నిద్రమాని జెన్నీఫర్ ని చూస్తుండిపోతారు. తన స్వరం ఎంత మధురంగా ఉంటుందో, రూపం కూడా అంతే. ఐ లవ్ యు చెప్పిన వాళ్ళ సంఖ్యని అయితే కనిపెట్టడం ఏఐ కాదు కదా దాన్ని పుట్టించిన వాడి వల్ల కూడా కాదు. స్వచ్చతతో కూడిన ఒరిజినల్ కళకి అంతటి శక్తి ఉంది. అలాంటి జెన్నీఫర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన మాటలు అభిమానులనే కాదు, ప్రతి ఒక్కర్ని ఎంతగానో బాధకి గురి చేస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం.
ఆమె మాట్లాడుతు లైఫ్ లో నేను నేర్చుకున్న పెద్ద పాఠం 'సెల్ఫ్ లవ్'. లెక్కకి మించిన స్టార్‌డమ్, సక్సెస్ అందుకున్నాను. కానీ నాలుగు సార్లు పెళ్లి, ఏడు ఎంగేజ్‌మెంట్స్ జరిగినప్పటికీ నిజమైన ప్రేమ మాత్రం దక్కలేదు. ఎన్నో సంవత్సరాలుగా నాలో నేను బాధపడుతున్నాను. కానీ బయటకి మాత్రం మాములుగా ఉంటు భావోద్వేగాన్ని బయట ప్రపంచానికి చూపించకుండా దాచేస్తున్నాను. నేను ప్రేమించదగిన వ్యక్తినే. కానీ కొంతమంది నిజంగా ప్రేమించలేరు. బయట ఎంత సక్సెస్ ఉన్నా, మనసుకి శాంతి కలిగించేది నిజమైన ప్రేమ, అర్థం చేసుకోవడమేనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటల వరల్డ్ నెట్టింట్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
Also read: Dhurandhar 2: ధురంధర్ 2 థియేటర్ లో ప్రభాస్, సందీప్ రెడ్డి ఏం చేసారో చూసారా!
తాను చెప్పినట్టుగా ఆమె వ్యకిగత జీవితం విషయానికి వస్తే మొత్తం నాలుగు సార్లు మ్యారేజ్ చేసుకుంది. 1997లో క్యూబన్ నటుడు ఒజాని నోవాతో మొదటి సారి వివాహం జరగగా ఏడాదికే ఆ బంధం ముగిసింది. ఆ తర్వాత 2001లో డ్యాన్సర్ క్రిస్ జడ్ ని 2004లో గాయకుడు మార్క్ ఆంథోనీని పెళ్లి చేసుకుంది.మార్క్, జెన్నిఫర్ కి ఇద్దరు కవల పిల్లలు. దాదాపు పదేళ్లు కలిసి జీవించిన తర్వాత విడిపోయారు. 2022లో నటుడు బెన్ అఫ్లెక్‌ని పెళ్లి చేసుకుంది. 2002లోనే మొదటిసారి నిశ్చితార్థం చేసుకుని విడిపోయిన ఈ జంట, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కలుసుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ బంధం కూడా గత ఏడాదితో క్లోజ్ అయ్యింది. జెన్నీఫర్ పెళ్లి లిస్టే కాదు, డేటింగ్ హిస్టరీ కూడా చాలా పెద్దదే అని టాక్ . సీన్ "డిడ్డీ" కోంబ్స్, కాస్పర్ స్మార్ట్, అలెక్స్ రోడ్రిగ్జ్ వంటి ప్రముఖులతో డేటింగ్ చేసినట్టుగా హాలీవుడ్ సినీ సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతు ఉంటుంది. నటిగాను పలు చిత్రాల్లో చేసి ఆయా చిత్రాల రేంజ్ ని పెంచిన జెన్నిఫర్ ఏజ్ ప్రెజెంట్ 56. జల్సాలో జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి అని పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పాడిన విషయం గుర్తుంది కదా!







