
-నిన్న నైట్ అల్లు సినిమాస్ లో ప్రభాస్, సందీప్ రెడ్డి
-ధురంధర్ కి ఇంకా ప్లస్ అవుతుందా!
-స్పిరిట్ అప్ డేట్ ఏంటి
హమ్మయ్య ఇన్ని రోజులకి దురంధరుడు(Dhurandhar 2) కి మోక్షం వచ్చింది. మోక్షం రావడమే కాదు, పలానా లెజండ్రిస్ మా ఆతిధ్యం స్వీకరించారని చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడింది. మరి ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి వంగ(sandeep Reddy vanga)దురంధరుడుని వీక్షిస్తే అట్లనే ఉంటుంది పరిస్థితి. పైగా కలెక్షన్స్ కూడా పెరిగే పరిస్థితి. ఆ డీటెయిల్స్ చూద్దాం.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ నిన్న నైట్ హైదరాబాద్ కోకాపేట ఏరియాలోని అల్లు సినిమాస్ లో దురంధుడుని వీక్షించారు. ఈ సందర్భంగా థియేటర్ లోపల ఆ ఇద్దరు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన రీతిలో నిలబడి ఉన్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు స్పందిస్తు ధురంధర్ రికార్డ్స్ ని మీ అప్ కమింగ్ మూవీ స్పిరిట్ బద్దలు కొట్టేలా ఉండాలని కోరుతున్నారు. ఫ్యాన్స్ కోరుకోవడమే కాదు ప్రభాస్, సందీప్ కూడా ధురంధర్ ని చూస్తున్నంత సేపు తమ సినిమా కూడా అంతకు మించి ఉండాలనుకునే ధర్మంతో కూడిన సినీ ఈర్ష్య తో ఉండే ఉంటారు.
Also read: ntr: వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ట్వీట్.. ముమ్మాటికీ అల్లు అర్జున్ గురించే చెప్పాడు
ప్రస్తుతానికైతే స్పిరిట్(Spirit)సెట్స్ పైనే ఉంది. ప్రభాస్ పోలీస్ కాప్ గా కనిపిస్తుండగా ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకుంటుంది. త్రిప్తి డిమ్రి హీరోయిన్. ధురంధర్ ప్రెజెంట్ 1700 కోట్ల కలెక్షన్స్ తో వాట్ డు వాట్ నాట్ డూ అనే రీతిలో దూసుకుపోతుంది.






