Home

»

Latest News

Allu Arjun: అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. మిగతా స్టార్ హీరోల పరిస్థితి ఏంటి?

Apr 08, 2026

  • పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ కీలక నిర్ణయం!
  • ఐకాన్ స్టార్ బాటలో మిగతా స్టార్స్ పయనిస్తారా?

పాన్ ఇండియా ట్రెండ్ వల్ల హీరోల మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో.. అదే స్థాయిలో హీరోల సినిమాల కౌంట్ కూడా తగ్గిపోయింది. ఏడాదికి ఒక సినిమా సంగతి అటుంచితే.. రెండు మూడేళ్ళకు ఒక సినిమా వస్తుందో లేదో అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇలాంటి సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్(TFJA) సభ్యులు కూడా అల్లు అర్జున్ ని కలిసి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మీడియా మిత్రులతో సరదాగా ముచ్చటించడమే కాకుండా, 'రాకా' సినిమా సంగతులను పంచుకున్నారు. అంతేకాదు, ఇక నుంచి ఏడాదికి లేదా ఏడాదిన్నరకు రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు.

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు చాలా తగ్గిపోయాయి. కొందరైతే ఒక్కో సినిమా చేయడానికి రెండు మూడేళ్లు కూడా తీసుకుంటున్నారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఏడాదికి కనీసం ఒక సినిమా విదులయ్యేలా చూసుకోవాలని కోరుతున్నారు. మిగతా స్టార్ల సంగతి ఎలా ఉన్నా.. అల్లు అర్జున్ మాత్రం ఇక మీదట ఏడాదికి ఒక సినిమా కాదు, కుదిరితే రెండు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. అల్లు అర్జున్ బాటలోనే మిగతా స్టార్స్ కూడా పయనిస్తే.. ఏడాది పొడవునా థియేటర్లు కళకళలాడతాయి అనడంలో సందేహం లేదు.

కాగా, అల్లు అర్జున్ తన 22వ సినిమా 'రాకా'(Raaka)ను అట్లీ దర్శకత్వంలో చేస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే తన 23వ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో అనౌన్స్ చేశారు. సుకుమార్ తో 'పుష్ప-3' చేయాల్సి ఉంది. వీటితో పాటు పలు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com