
- మెగా ఫ్యాన్స్ కి మరో షాక్!
- పెద్ది రిలీజ్ డేట్ మళ్ళీ మారిందా?
- లెనిన్ రిలీజ్ డేట్ తో మళ్ళీ మొదటికి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సి ఉండగా, ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. అక్కడి నుంచి మళ్ళీ జూన్ 26కి వాయిదా పడినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా కన్ఫర్మ్ కాలేదని తెలుస్తోంది.
అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మొదట ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఏప్రిల్ 30న 'పెద్ది' ఉండటంతో తమ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా 'పెద్ది' కొత్త విడుదల తేదీగా ప్రచారం జరుగుతున్న జూన్ 26పై 'లెనిన్' కర్చీఫ్ వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇప్పటికే జూన్ 26న లెనిన్ ని విడుదల చేయనున్నట్లు తెలిపిన మేకర్స్.. నేడు(ఏప్రిల్ 8) అక్కినేని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేశారు. అదే తేదీకి తమ సినిమాని తీసుకొస్తున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ ను వదిలారు.
గతంలో 'పెద్ది' కోసమే తమ సినిమాని వాయిదా వేసినట్లు 'లెనిన్' టీమ్ ప్రకటించింది. అలాంటిది ఇప్పుడు పెద్దికి పోటీగా విడుదల చేసే అవకాశంలేదు. జూన్ 26న పెద్ది రావట్లేదనే సమాచారంతోనే ఆ తేదీపై లెనిన్ టీమ్ కర్చీఫ్ వేసి ఉంటుంది. దీంతో 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ పై మళ్ళీ సస్పెన్స్ నెలకొంది.
అయితే 'పెద్ది' మూవీ జూన్ 26 కంటే ముందే వచ్చే అవకాశముందని తెలుస్తోంది. జూన్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: ఇతను హీరో ఏంటి అన్నారు.. ఇప్పుడు పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాడు!






