Home

»

Latest News

Janhvi Kapoor: బుర్రని వాడాలి కదా!.. సంబంధం లేని వ్యక్తులు తగిలారు  

Apr 08, 2026


-జాన్వీ కపూర్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ 
-సంబంధం లేని వ్యక్తులు ఎవరు 
-అమ్మ బతికి ఉన్నపుడు జాలి చూపించలేదు 
-అసలు ఆ విషయంలో బుర్రనే వాడలేదు 

అచ్చాయమ్మాగా పెద్ది(Peddi)తో కలిసి సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయడానికి శ్రీదేవి(Sridevi)తనయ జాన్వీ కపూర్(Janhvi Kapoor)సిద్దమవుతుంది. దేవరలో విలేజ్ గర్ల్ గా రెబల్ బాడీ లాంగ్వేజ్, హావభావాలతో ఎన్టీఆర్(NTR)ని ఊపిరి సలపని ఉక్కపోతకి గురి చేసిన జాన్వీ మళ్ళీ విలేజ్ గర్ల్ గానే పెద్దిని ఏం చెయ్యబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది. అభిమానులైతే ఆ విషయంలో నో కాంప్రమైజ్ అని ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది కదా,అచ్చాయమ్మా కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ గా వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందర్నీ జాన్వీ మాటలు షాక్ కి గురి చేస్తున్నాయి. నెటిజన్స్ ది అదే సిట్యువేషన్.  మరి జాన్వీ మాటలని చూద్దాం.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతు నేను తల్లిపై ఆధారపడిన కూతుర్ని. సొంత నిర్ణయాలు తీసుకునేందుకు నా మెదడులోని సామర్ధ్యాన్ని ఉపయోగించే దానిని కాదు. అందుకే ప్రతి విషయానికి అమ్మపైనే ఆధారపడ్డాను. అలాంటిది అమ్మ మరణంతో నా నిర్ణయాలు నేనే తీసుకోవాలనే పరిస్థితులని సృష్టించింది. దాంతో కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. ముఖ్యంగా నా లైఫ్ లోకి సంబంధం లేని వ్యక్తులని రానిచ్చాను. ఇక నుంచి అలా చెయ్యను. అమ్మ విషయంలో ఇప్పుడు జాలి చూపిస్తున్నంత వాళ్లంతా ఆమె బతికి ఉన్నపుడు జాలి చూపించే వారు కాదు. తన వ్యక్తిగత జీవితం గురించి చాలా మాటలు అనేవారు. అవన్నీ అమ్మని ఎంతగానో బాధపెట్టేవి. ఆ రోజు నేను ఆ బాధని అర్ధం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేను ఆ బాధని అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చింది. 


Also read: Ntr: ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలని చెప్పుకుంటానంటున్న హీరోయిన్ 

జాన్వీ రీసెంట్ గా తన పిక్స్ ని అసభ్యకరమైన రీతిలో షూట్ చేసే ఫొటోగ్రాఫర్ల తీరుపై మండి పడుతు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పెద్ది తర్వాత ఇంకా ఏ చిత్రానికి జాన్వీ కమిట్ కాలేదు. అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ 'రాకా' లో ఒకే అయ్యిందనే న్యూస్ చాలా రోజుల నుంచి స్వతంత్రంగానే చక్కర్లు కొడుతుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com