
టాలెంటెడ్ హీరో అడివి శేష్ నుంచి సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు బలంగా నమ్ముతారు. దానికి తగ్గట్టుగానే ఆయన నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’ (Dacoit) ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ జారీ చేయగా, సినిమా రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలుగా లాక్ చేయబడింది. సెన్సార్ టాక్ ప్రకారం.. ఈ సినిమా ఒక ఇంటెన్స్ ఎమోషనల్ జర్నీ అని, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో వెండితెరపై మ్యాజిక్ చేయబోతుందని తెలుస్తోంది.
ఫస్ట్ హాఫ్: ప్రేమ, కుట్రల మధ్య ప్రయాణం
సినిమా ప్రారంభం చాలా సహజంగా, ఒక అమాయకమైన ప్రేమకథతో మొదలవుతుందట. ఒక క్రూరమైన ప్రపంచంలో కుట్రల మధ్య ఈ ప్రేమ ఎలా సాగిందనేది చాలా హార్ట్ టచింగ్‌గా చూపించారట. ముఖ్యంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రాణమని సమాచారం.
సినిమాటోగ్రఫీ అదిరిపోయిందట. ముఖ్యంగా ఎస్కేప్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయట. స్టైలిష్ ఎడిటింగ్ సినిమా వేగాన్ని పెంచింది. ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్ అని, ప్రేమ అనే పదానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తూ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌తో ముగుస్తుందని అంటున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్ పోషించిన 'స్వామి' పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందట.
సెకండ్ హాఫ్: ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యాక్షన్
సెకండ్ హాఫ్ పూర్తిగా యాక్షన్ మరియు ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఛేజింగ్ సీన్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఉంటాయట. స్టంట్స్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుందని టాక్. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తాయట.
గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక గొప్ప ప్రేమకథను కమర్షియల్ పంథాలో అద్భుతంగా ఆవిష్కరించారట. వరల్డ్ క్లాస్ స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు సినిమాను నడిపించినట్లు తెలుస్తోంది. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లస్ పాయింట్. ప్రతి సన్నివేశాన్ని సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లిందని చెబుతున్నారు.
మొత్తానికి 'డెకాయిట్' సినిమా అడివి శేష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది. బలమైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, అద్భుతమైన నటన కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమనిపిస్తోంది.





