Home

»

Latest News

Meher Ramesh: ట్రెండింగ్ లోకి డైరెక్టర్ మెహర్ రమేష్.. మహేష్, అల్లు అర్జున్ తర్వాత ఎవరు?

Apr 08, 2026

ప్రస్తుతం చేతిలో సినిమాలే లేని టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) అనూహ్యంగా ట్రెండింగ్ లోకి వచ్చారు. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్‌కు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ.. ప్రజెంట్ టాలీవుడ్ లో రూపొందుతోన్న కొన్ని భారీ బడ్జెట్ సినిమాల టైటిల్స్ కి, క్యారెక్టర్ పేర్లకు మెహర్ రమేష్ ఇన్స్పిరేషన్ గా మారారంటూ నెటిజెన్లు పోస్ట్ లు పెడుతున్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'శక్తి'. 2011 లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. రిజల్ట్ పక్కన పెడితే, ఇప్పుడు టాలీవుడ్‌లో రాబోతున్న రెండు భారీ సినిమాలకు ఈ 'శక్తి' సినిమానే ఇన్స్పిరేషన్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

మహేష్ బాబు 'రుద్ర'.. అల్లు అర్జున్ 'రాకా'!
'శక్తి' సినిమాలో ఎన్టీఆర్ పోషించిన ఒక పాత్ర పేరు 'రుద్ర'. అలాగే ఆ సినిమాలో మెయిన్ విలన్ పేరు 'రాకా'. ఇప్పుడు ఆ రెండు పేర్లు ట్రెండ్ అవుతున్నాయి.

మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి'(Varanasi). ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు 'రుద్ర'(Rudra).

ఇక కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాకు 'రాకా'(Raaka) అనే టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. 'రాకా' అంటే రాక్షసుడు అనే అర్థం వస్తుంది.

ఇలా మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన 'శక్తి' సినిమాలోని హీరో పేరు 'వారణాసి'లో హీరో పేరు అయింది. అలాగే శక్తిలోని విలన్ పేరు అల్లు అర్జున్ సినిమా టైటిల్ గా మారింది. 

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
ఈ కో-ఇన్సిడెన్స్‌పై మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. "మెహర్ రమేష్ థాట్స్ అప్పట్లోనే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి" అని కొందరు అంటుంటే, "రాజమౌళి, అట్లీ వంటి స్టార్ డైరెక్టర్లకు కూడా మెహర్ రమేష్ క్యారెక్టర్ పేర్లే దిక్కయ్యాయి" అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

మొత్తానికి ప్లాపుల్లో ఉన్న మెహర్ రమేష్, ఇలా తన పాత సినిమా క్యారెక్టర్ల పేర్ల ద్వారా మళ్ళీ వార్తల్లో నిలవడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే, 'శక్తి' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా, అందులోని పేర్లు మాత్రం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్లుగా మారుతున్నాయి.

Also Read: ఇతను హీరో ఏంటి అన్నారు.. ఇప్పుడు పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాడు!

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com