సినిమా పేరు: సింగిల్
తారాగణం: శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా,రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య, కల్పలత తదితరులు
మ్యూజిక్ : విశాల్ చంద్రశేఖర్
ఫొటోగ్రఫీ: ఆర్ వేల్ రాజ్
ఎడిటర్: ప్రవీణ్ కె ఎల్
రచన, దర్శకత్వం: కార్తీక్ రాజు
నిర్మాతలు: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి
సమర్పణ : అల్లు అరవింద్
బ్యానర్ :గీతా ఆర్ట్స్
విడుదల తేదీ: మే 9 ,2025
సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటు తనదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు శ్రీ విష్ణు(Sri Vishnu). గత ఏడాది అక్టోబర్ లో 'స్వాగ్' తో థియేటర్స్ లోకి అడుగుపెట్టిన శ్రీ విష్ణు ఈ రోజు 'సింగిల్'(Single)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
ఒక ప్రవైట్ బ్యాంక్ లో వర్క్ చేసే విజయ్(శ్రీ విష్ణు) చాలా సరదా మనిషి. మాట్లాడే ప్రతి మాటలోను తనదైన స్టైల్లో కామెడీ పంచ్ ఉంటుంది. కాకపోతే లవర్ లేకుండా సింగల్ గా ఉన్నానని బాధపడుతు, తన ఏకైక ఫ్రెండ్ అరవింద్ (వెన్నెల కిషోర్) కి లవర్ ఉండటంతో వాళ్లెప్పుడు విడిపోతారా అని ఎదురుచూస్తుంటాడు. ఈ క్రమంలో ఒక పేరున్న కార్ల కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే పూర్వ (కేతికాశర్మ) ని ఇష్టపడతాడు. కానీ పూర్వకి విజయ్ అంటే ఇష్టం ఉండకపోయినా ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతుంది. డాన్స్ చెయ్యడంలో నెంబర్ వన్ అయిన హరిణి( ఇవానా) విజయ్ ని ప్రేమిస్తున్నాని చెప్పి వెంట పడుతుంటుంది. కానీ విజయ్ కి హరిణి అంటే ఇష్టం ఉండదు. హరిణి ఎందుకు విజయ్ ని ప్రేమిస్తున్నానని వెంటపడుతుంది? పూర్వ ఎందుకు విజయ్ ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడింది? ఆ నిజం విజయ్ కి తెలిసిందా? లైఫ్ లో ఒక తోడు కావాలని కోరుకున్న విజయ్ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఒక వేళ సింగిల్ గా మిగిలిపోతే అందుకు కారణం ఏంటి అనేదే ఈ చిత్ర కథ
ఎనాలసిస్ :
చాలా సింపుల్ స్టోరీకి అందమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన డైలాగ్స్ కుదరడంతో సింగిల్ మూవీ థియేటర్ లో నవ్వులు పూయించింది. మూవీ ఆసాంతం శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ లోకి వెళ్ళిపోయి మన పక్కింటి కుర్రాళ్ళ మధ్య జరిగే కథని చుస్తున్నామనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే శ్రీవిష్ణు, వెన్నెలకిషోర్ మధ్య కామెడీ సీన్స్ బాగా పేలాయి. నాన్ స్టాప్ గా నవ్వించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. కేతికా శర్మ పాత్ర పరిచయం, ఆ తర్వాత శ్రీవిష్ణు,కేతిక మధ్య వచ్చే సీన్స్ కూడా బాగా పండాయి. కేతిక శర్మ క్యారక్టర్ కి ఆమె కాకుండా ఇంకో హీరోయిన్ అయితే బాగుండేదేమో. శ్రీ విష్ణుపై నిజమైన ప్రేమ కలిగినప్పుడు గతంలో మోసం చేశాననే నిజం విష్ణుకి చెప్పకుండా ఉంటే బాగుండేది. వాళ్ళిద్దరి మధ్య నిజమైన లవ్ జర్నీ ని కొంచం లెంగ్త్ లో చూపించాల్సింది. ఇవానా క్యారక్టర్ అయితే సినిమాకి మంచి హెల్ప్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ ని కంటిన్యూ చేస్తు శ్రీ విష్ణు, కేతిక, ఇవానా, వెన్నెలకిషోర్ మధ్య వచ్చిన సీన్స్ నవ్వులని పూయించాయి. చివర్లో రాజేంద్ర ప్రసాద్ క్యారక్టర్ ఎంటర్ అయ్యి సినిమాకి ఒక అర్దాన్ని తెచ్చింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా సాగి థ్రిల్ కి గురి చేసాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు
విజయ్ అనే క్యారక్టర్ లో శ్రీ విష్ణు చాలా నాచురల్ గా చేసాడు. తన కోసమే ఆ క్యారక్టర్ పుట్టిందా అనేంతలా తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మ్ ఇవ్వడంతో పాటు, కామెడీ టైమింగ్ లో తనకి తిరుగులేదని మరోసారి చాటి చెప్పాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ హైలెట్. పూర్వ, హరిణి గా చేసిన కేతిక శర్మ(kethika Sharma)ఇవానా(Ivana)కూడా తమ క్యారక్టర్ లు కనపడేలా నటించడంలో నూటికి నూరుపాళ్లు విజయం సాధించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, వి టి వి గణేష్, ప్రభాస్ శ్రీను కూడా ఎప్పటిలాగానే అత్యద్భుతంగా నటించారు. నిర్మాణ విలువలతో పాటు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, వేల్ రాజ్ ఫొటోగ్రఫీ కూడా ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. కార్తీక్ రాజు (Caarthik Raju)దర్శకత్వ పని తీరు కూడా చాలా బాగుంది. డైలాగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
సింగిల్ మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వులని పూయించింది.