సినిమా పేరు: ఆంధ్ర కింగ్ తాలూకా
తారాగణం: రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర, రావు రమేష్, మురళి శర్మ, రాజీవ్ కనకాల, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్:వివేక్ మెర్విన్
రచన, దర్శకత్వం: పి. మహేష్ బాబు
సినిమాటోగ్రాఫర్: సిద్దార్ధ్ నూని, జార్జ్ విలియమ్స్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్
విడుదల తేదీ: నవంబర్ 27 ,2025
ఎనర్జిటిక్ స్టార్ 'రామ్ పోతినేని'(Ram Pothineni)ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో 'ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka)తో ల్యాండ్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ తో రిలీజ్ అయిన మూవీగా కూడా నిలిచింది. అందాల తార భాగ్యశ్రీ బోర్స్(Bhagyashri Borse),కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(Upendra)స్పెషల్ ఎట్రాక్షన్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
సాగర్ (రామ్ పోతినేని) ప్రేమ, అభిమానంతో కూడిన కల్లాకపటం లేని ఒక నిరుపేద యువకుడు. గోదావరి నదికి మద్యలో ఉండే గోడవల్లి లంక తన ఊరు. ఆ ఊరు ఒకటనేది ఉందని బయట ప్రపంచానికి తెలియదు. కరెంటు కూడా లేని ఆ ఊరు వర్షం వస్తే మునిగిపోతుంది. చిన్న వయసు నుంచే స్టార్ హీరో సూర్య కి సాగర్ వీరాభిమాని. సూర్య కి ఆంధ్రకింగ్ అనే బిరుదు కూడా సాగర్ నే ఇస్తాడు. టౌన్ లో పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతుంటాడు. అదే కాలేజీలో చదివే పెద్దింటి అమ్మాయి మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్స్) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. మహాలక్షి కి సాగర్ స్వచ్ఛమైన మనసు నచ్చడంతో తను కూడా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. వరుస ప్లాప్ లు రావడంతో ఆర్ధిక ఇబ్బందుల వల్ల సూర్య వందవ సినిమా ఆగిపోతుంది. దీంతో సాగర్ కోసం సూర్య బయలు దేరతాడు. సూర్య కోసం స్టార్ హీరో సాగర్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సూర్య ఆర్ధిక బాధలకి సాగర్ కి ఏమైనా సంబంధం ఉందా? సాగర్ ప్రేమ ఏమైంది? అసలు సూర్య పై సాగర్ వీరాభిమానాన్నిపెంచుకోవడానికి సినిమానే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? సాగర్ ఊరు పరిస్థితిలో మార్పు ఏమైనా వచ్చిందా ? అసలు ఆంధ్ర కింగ్ తాలూకు ఏ ఉద్దేశ్యంతో తెరకెకెక్కిందనేదే చిత్ర కథ.
ఎనాలసిస్ :
చిత్ర కథ, కథనాలు ఎంతో మందికి హీరోలకి ఆ హీరోని అభిమానించే అభిమానులకి ఇన్ స్ప్రెషన్ కలిగిస్తాయి.కాకపోతే ఊహించిన విధంగా సీన్స్ వస్తుండటంతో పాటు సదరు సీన్స్ అన్ని చాలా సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తాయి. ప్రేమించిన అమ్మాయికి పెద్దగా విలువ ఇవ్వకపోవడం అనేది మైనస్ గా నిలిచే అవకాశం ఉంది. పైగా ఇలాంటి చిత్రాలకి సాంగ్స్ క్యాచీగా ఉండాలి. ఆ విధంగా లేకపోవడం కూడా ఆంధ్రా కింగ్ కి మైనస్.
ఒక్క ట్యూన్ కూడా మెప్పించలేదు. కానీ పతాక సన్నివేశాలు మూవీకి ప్రాణంగా నిలిచాయి. 2000 వ సంవత్సరంలో జరిగే కథ కావడం మరో ప్లస్.ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ప్రారంభంలోనే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఆర్థిక బాధలు వస్తే సినిమా ఎలా ఆగిపోతుందో చెప్పి కథపై క్యూరియాసిటీ కలిగించారు. సాగర్ ఎంట్రీ సీన్ తో పాటు సినిమా హీరోని ఎంతగా అభిమానిస్తారో చూపించడం బాగుంది. సాగర్, మహాలక్ష్మి మధ్య వచ్చే సీన్స్ సెల్ ఫోన్ లేని రోజుల్లో ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఆ ప్రేమ తాలూకు హృదయాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో చూపించారు.
కాకపోతే బలమైన సీన్స్ లేకపోవడంతో కథనంలో క్రమంగా గ్రిప్ తప్పుతూ వచ్చింది.గోదావరి అందాలని సరిగా వాడుకోలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిందే.సెకండ్ హాఫ్ లో దర్శకుడి పనితనం బయటపడింది. ఒకే ప్లాట్ పై కథనాలు వెళ్తున్న సమయంలో గోడవల్లి లంక మనుషుల్లో సాగర్ చైతన్యం తీసుకురావడంతో పాటు సాగర్ తీసుకున్న నిర్ణయాలు మెప్పిస్తాయి. సూర్య ని టౌన్ లో మనుషుల మధ్య ఎంటర్ చేసి ఉండాల్సింది.
అందరు స్టార్ హీరో సూర్యకి డూప్ రా అని అనుకునేలా చేస్తే కొంచం ఎంటర్ టైన్ మెంట్ రన్ అయ్యేది. తన ప్రేమని వదులుకునేటపుడు సాగర్ లో బాధని మరింతగా చూపించాల్సింది.ముందుగా చెప్పుకున్నట్టు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సూపర్ గా ఉండి ఆంధ్రా కింగ్ తాలూకు కథకి పూర్తి జస్టిఫై ని ఇచ్చాయి. సూర్య చివర్లో తీసుకున్న నిర్ణయం ఎంతో మంది హీరోలకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. .శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పని తీరు కొంచం కాపాడింది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
సాగర్ (రామ్ పోతినేని) గా రామ్ పోతినేని పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఊరుతో పాటు ఊరిలోని మనుషులు బాగుపడాలనే యువకుడిగా, ప్రేమించిన అమ్మాయి కోసం పరితపించే ప్రేమికుడిగా, అభిమాన హీరో బాగు కోసం పరితపించే అభిమాని గా విజృంభించి నటించాడు. ముఖ్యంగా లవ్, ఎమోషన్ సీక్వెన్స్ లో రామ్ నటన పతాక స్థాయిలో ఉంది. మహాలక్ష్మిగా భాగ్యశ్రీ బోర్స్ కెరీర్ లో మరోసారి అత్యున్నత నటనని కనబర్చింది. సదరు క్యారక్టర్ తన కోసమే పుట్టినట్టుగా తన క్యారక్టర్ పరిధి మేరకు మెప్పించింది. స్టార్ హీరో సూర్యగా ఉపేంద్ర పూర్తి స్థాయిలో మెప్పించాడు. ఆ క్యారక్టర్ లో ఉపేంద్ర ని తప్ప మరో హీరోని ఉహించుకోలేని విధంగా తన నటన కొనసాగింది. మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన రావు రమేష్, మురళి శర్మ, సత్య కూడా తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు. మహేష్ బాబు(P. Maheshbabu)దర్శకుడిగా సక్సెస్ అయినా రచయితగా తడబడ్డాడు. ఒకే కథ లో మూడు జోనర్స్ ని ఎంచుకోవడంతో వాటిని సరిగా డీల్ చెయ్యకపోయాడు. మైత్రి నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా, సాంగ్స్ మాత్రం మెప్పించలేకపోయాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కథ పాయింట్ బాగున్నా మూడు జోనర్స్ మిక్స్ అవ్వడంతో మేకర్స్ కొద్దిగా తడబడ్డారు. సాంగ్స్ బాగోకపోవడం కూడా మైనస్. దీంతో పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. కాకపోతే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగుండటంతో పాటు రామ్, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే నటన ఆంధ్రా కింగ్ కి ప్లస్ గా నిలిచాయి.
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.