Home  »  News  »  IMDb: ఐఏండిబీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ఈ ఛోటా హీరోనే.. స్టార్స్ ని వెనక్కి నెట్టేసి మరి

Updated : May 29, 2026

 

చలనచిత్ర పరిశ్రమలో ఒక నటుడు స్టార్‌డమ్ అందుకోవాలంటే ఎన్నో ఏళ్ల కష్టం, భారీ బడ్జెట్ సినిమాలు, బలమైన ఫ్యాన్ బేస్ అవసరం. కానీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం ఒకే ఒక్క సపోర్టింగ్ క్యారెక్టర్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకొని ఐఏండిబీ లో నెంబర్ వన్ ప్లేస్ లో నిలవడం అంటే సామాన్యమైన విషయం కాదు.  


కానీ ఆ ఘనతని సాధించాడు యుధ్వీర్ అహ్లావత్(yudhvir ahlawat). నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 15న విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'కర్తవ్య' (Kartavya)లో సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి నటించిన ఈ నటుడు, ఇప్పుడు దేశంలోనే అత్యంత పాపులర్ సెలబ్రిటీగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా నెలకు 25 కోట్ల (250 Million) కంటే ఎక్కువ మంది సందర్శించే ప్రముఖ సినిమా వెబ్‌సైట్ IMDb విడుదల చేసిన తాజా వీక్లీ పాపులారిటీ ర్యాంకింగ్స్‌లో యుధ్వీర్ అహ్లావత్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో  ఇండియన్ సినిమా సూపర్ స్టార్లు  షారుఖ్ ఖాన్, దళపతి విజయ్,  ఎన్టీఆర్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ వంటి దిగ్గజాలని  వెనక్కి నెట్టడం విశేషం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్శనతో మూడో స్థానంలో నిలిచిన ఐశ్వర్య రాయ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతున్న దళపతి విజయ్, గ్లోబల్ క్రేజ్‌తో 24వ స్థానంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. వీరందరి కంటే యుధ్వీర్ అహ్లావత్ ప్రొఫైల్‌ని  ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారు. అసలు టాప్ 30 జాబితాలోనే లేని షారుఖ్ ఖాన్ లాంటి స్టార్లతో పోలిస్తే, ఈ కొత్త నటుడి ప్రొఫైల్ వీక్షణలు భారీగా పెరిగాయి. 

'కర్తవ్య' లో యుధ్వీర్ అహ్లావత్ హర్పాల్ అనే 14 ఏళ్ల మైనర్ బాలుడి క్యారక్టర్ కి పోషించాడు. మానసిక, శారీరక వేధింపులకి  గురై, ఒక హత్య చేయడానికి పురికొల్పబడే బాలుడిగా అతడి  పెర్ఫార్మ్  అద్భుతం . స్క్రీన్‌పై అతడి అమాయకత్వం, హావభావాలు  చూసిన ప్రతి ఒక్కరూ అతడిని నిజంగానే 14 ఏళ్ల చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నారు. సినిమా ముగిసిన వెంటనే ఆ అద్భుతమైన నటుడు ఎవరో తెలుసుకోవాలనే కుతూహలంతో నెటిజన్లు గూగుల్, IMDb లలో వేట మొదలుపెట్టారు. అలా వెతికిన వారందరికీ ఒక మైండ్ బ్లోయింగ్ నిజం తెలిసింది. సినిమాలో 14 ఏళ్ల పిల్లాడిగా కనిపించిన ఆ నటుడి అసలు వయసు అక్షరాలా 33 ఏళ్లు.అవును, అతడు మైనర్ కాదు, మూడు పదుల వయసు దాటిన పరిణతి చెందిన నటుడు.

Also read: Arjun: సనాతన ధర్మంపై అర్జున్ సంచలన వ్యాఖ్యలు.. ఆ బడా హీరోకి కౌంటర్ ఇచ్చినట్లేనా! 

హర్యానాలోని ఝజ్జర్ జిల్లా షేరియా గ్రామానికి చెందిన యుధ్వీర్ అహ్లావత్ది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కుటుంబం. అతడి తండ్రి జ్ఞాన్ సింగ్ అహ్లావత్ దేశానికి సేవలందించారు. ఆరు అడుగుల పైగా ఎత్తుండే తన అన్నల కంటే యుధ్వీర్ చాలా పొట్టిగా, చిన్న పిల్లాడి తరహా ముఖవర్చస్సుతో ఉంటాడు. 2019లో వచ్చిన 'సాండ్ కీ ఆంఖ్' సినిమాతో వెండితెరకు పరిచయమైనప్పుడు కూడా, 28 ఏళ్ల వయసులో ఉన్న యుధ్వీర్‌ను అందరూ చిన్న పిల్లాడనే అనుకున్నారట. ఆ తర్వాత రణబీర్ కపూర్ 'షంషేరా', బాబీ డియోల్ 'లవ్ హాస్టల్' వంటి చిత్రాల్లో చిన్న క్యారెక్టర్స్  చేసినా రాని గుర్తింపు, ఇప్పుడు 'కర్తవ్య' సినిమా తెచ్చిపెట్టింది. ఎలాంటి పీఆర్ స్టంట్లు, సోషల్ మీడియా పెయిడ్ ప్రమోషన్లు లేకుండా కేవలం తన అసాధారణ నటనతో, 33 ఏళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి IMDbలో నంబర్ 1 స్థానాన్ని అందుకోవడం భారతీయ ఓటీటీ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోతుంది.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.