Home

»

Latest News

టైర్ 1 స్టార్లకు గట్టి పోటీ ఇస్తున్న టైర్ 2 హీరోలు!

Feb 9, 2023 10:14AM

టాలీవుడ్ లో టైర్  1 హీరోల జాబితా తీసుకుంటే అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్లు  చాలామంది కనిపిస్తారు. వీరి  సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటుతున్నాయి. వీరి రెమ్యూనరేషన్ 50 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక వీరితో సినిమా అంటే దాదాపు 100 నుంచి 150 కోట్లకు బడ్జెట్ రెడీ చేసుకోవాలి. సినిమాకు మంచి టాక్ వస్తే 200 కోట్లను ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. ఆపైన హిట్ టాక్  వస్తే ఎంతైనా సంపాదించవచ్చు.

అయితే టైర్ 2హీరోలకు వచ్చేసరికి వీరు కొడితే బ్లాక్ బస్టర్ లేకపోతే అట్టర్ ఫ్లాప్ అనే విధంగా ప‌రిస్థితి ఉంది.  సినిమా బాగా లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. హిట్ టాక్  వస్తే కాస్త లాభాలు వస్తున్నాయి. యావరేజ్ టాక్ తో  అస‌లు వ‌సూలు అవుతోంది. అలా అవి బ్రేక్ ఈవెన్  సాధిస్తున్నాయి.   కాబట్టి వీరితో చిత్రాలు చేయాలంటే కచ్చితంగా సూపర్ హిట్ చిత్రాలను తీయాల్సి వస్తుంది. వీళ్లతో ప్రాజెక్టు చేయడం నిర్మాతలకు కష్టమైన పని కాదు. మ‌రీ దారుణంగా లేకుండా జాగ్ర‌త్త ప‌డితే మినిమం గ్యారంటీ అనే చెప్పాలి. దాంతో ఇది  కాస్త సేఫ్ గేమ్ అని చెప్పవచ్చు. 

ఈ జాబితాలో నాని, అఖిల్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, నితిన్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, గోపీచంద్, రామ్ పోతినేని తదితరులు ఉన్నారు. వీరి సినిమాలకు 30 నుంచి 50 కోట్ల బడ్జెట్ సరిపోతుంది. బ్లాక్ బస్టర్ అయితే 100 కోట్లు అందుకుంటాయి.  అయితే ఈ హీరోలు కూడా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో చిత్రాలు చేయాలని ఆలోచిస్తున్నారు. తమ ఇమేజ్ ను  టైర్  1 కు పెంచుకోవాలని భావిస్తున్నారు. దాంతో రెగ్యులర్ కథలను పక్కనపెట్టి కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ లు  ట్రై చేస్తున్నారు. రామ్ పోతినేని- బోయపాటి శీను  పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు.  నాని దసరా మూవీ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది.

ఇక అక్కినేని అఖిల్   ఏజెంట్ గా స్పై థ్రిల్ల‌ర్ తో  ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.  ఇది కూడా పాన్ ఇండియా చిత్ర‌మే. ఇక అక్కినేని నాగ‌చైత‌న్య తెలుగు, త‌మిళంలో ద్విభాషా చిత్రంగా చేస్తున్నారు.  క‌స్ట‌డీ సినిమాని డిఫరెంట్ టచ్ ఉన్న కాన్సెప్ట్ తో చేస్తున్నారు.  ఇక నితిన్ కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో స్మగ్లింగ్ నేపథ్యంలో ఉన్న కథతో పీరియాడికల్ మూవీ  చేస్తున్నార‌ట‌.  వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున సినిమాలో పోలీస్ ఆఫీసర్గా క్రైమ్ థ్రిల్ల‌ర్ లో నటిస్తున్నారు.  సాయి ధరమ్ తేజ్ విరూపాక్షని   థ్రిల్ల‌ర్ మూవీగా  చేస్తున్నారు.  ఈ సినిమాలు హిట్టు కొడితే వారి బ్రాండ్ ఇమేజ్ మారిపోవడం ప‌క్కా.  మరి వీరిలో ఎంతమంది ఆ విషయంలో విజయం సాధిస్తారో వేచి చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com