Home

»

Latest News

మహేష్- పవన్‌ల‌కు సీనియర్ హీరోయిన్ల కొరత!

Feb 9, 2023 12:07PM

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు -మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో ఓ చిత్రం చేస్తున్నారు.  ఈ చిత్రం వీరి కాంబినేషన్లో రానున్న మూడో చిత్రం. గతంలో వీరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి చిత్రాలు వచ్చాయి. పుష్కర కాలం తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ రానుంది. ఇందులో త్రివిక్రమ్ సినిమాలన్నింటిలో ఉన్నట్టుగానే హీరో హీరోయిన్లు కాకుండా మరో బలమైన లేడీ పాత్ర ఉంటుందట. ఈ పాత్ర కోసం శోభన, ట‌బు,  ఐశ్వర్యారాయ్ వంటి వారిని సంప్రదిస్తున్నారు. చివరగా రమ్యకృష్ణను కూడా ఈ పాత్ర కోసం ట్రై చేస్తున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్లో ఓ జి (ఒరిజిన‌ల్  గ్యాంగ్ స్టార్) చిత్రం చేస్తున్నారు.  ఫిబ్రవరి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. వీలైనంత తక్కువ టైంలో సుజిత్ ఈ సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  భారీ బడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోంది.  పవన్ నుంచి వచ్చే రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా కాకుండా కాస్త కొత్త కాన్సెప్ట్ తో ఉండనుంద‌ని టాక్   వినిపిస్తోంది. దాంతో ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ త్రివిక్రముల ఎస్ ఎస్ ఎం బి 28 కూడా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోంది. 

ఇంకా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పాన్ ఇండియా గా  విడుదల కానున్న మొదటి చిత్రం కానుంది. ఇక రెండో చిత్రం సుజిత్ సినిమా అవుతుంది. ఇక సుజిత్  సినిమాకి సంబంధించిన పలు వార్తలు చ‌క్క‌ర్లు  కొడుతున్నాయి. ఈ మూవీలో ఓ కీలక పాత్ర ఉంటుందట. దీనికోసం సీనియర్ హీరోయిన్లని సుజిత్ లైన్ లోకి తీసుకున్నాడని టాక్. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కు అత్తగా నటించిన నదియాను తీసుకోవాలని భావిస్తున్నారు. ఆమె కాదంటే ఆ పాత్రకు సీనియర్ హీరోయిన్, పొలిటీషియన్ అయినా నగ్మాను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.  ఇక మరో సీనియర్ హీరోయిన్ ట‌బుని  కూడా ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నారు. వీరంద‌రు సీనియ‌ర్ హీరోయిన్లుగా న‌టించి, ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా స్థిర‌ప‌డ్డారు.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వారు మారారు.

నగ్మా విషయానికి వస్తే ఆమె రాజకీయాల్లో ఉంది. ఆమె కనక నటిస్తే ఈ చిత్రం కి తెలుగు తో పాటు త‌మిళ్‌, హిందీలో కూడా మంచి క్రేజ్ వస్తుంది. కాబట్టి ఈ పాత్ర కోసం ముఖ్యంగా టబూ, నగ్మాలపై దృష్టిని కేంద్రీక‌రించి ఉన్నారు. వారిలో ఎవరో ఒకరు ఈ చిత్రంలో నటిస్తే ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని తెలుస్తోంది. ఉన్నా కూడా అది కథలో భాగంగా ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి కీరోల్ కోసం మాత్రం ట‌బు,  నగ్మా లేకుంటే నదియా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com