Home  »  News  »  kd the devil: వివాదాస్పద మూవీ కేడీ ది డెవిల్ ఓటిటి డేట్ ఇదే 

Updated : May 29, 2026

 

కన్నడ యాక్షన్ స్టార్ ధృవ్ సర్జా(d, సంచలన దర్శకుడు ప్రేమ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్  ‘కేడీ: ది డెవిల్’. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అంతకంటే భారీ అంచనాలతో   ఏప్రిల్ 30 విడుదలై డిజాస్టర్ టాక్‌ని చాలా పకడ్బందీగా  సొంతం చేసుకుంది. సుమారు 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో జనగణమన, మెగా 158 చిత్రాల ప్రొడ్యూసర్ వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 24.19 కోట్ల రూపాయల వసూళ్లను మాత్రమే సాధించి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. 

అయితే, థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులను అలరించేందుకు  ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5 వేదికగా జూన్ 5, 2026 నుండి  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. అయితే  ‘కేడీ  విడుదలకి ముందే ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి, సంజయ్ దత్ కాంబినేషన్‌లో చిత్రీకరించిన "సర్సే నిన్న సెరగ సర్సే" అనే ఐటమ్ సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పాటలోని లిరిక్స్ అత్యంత అభ్యంతరకరంగా, బూతు పదాలతో కూడి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వివాదం ఎంతలా ముదిరిందంటే.. సెన్సార్ బోర్డుతో పాటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, హర్యానా మరియు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్లలో కూడా ఫిర్యాదులు నమోదయ్యాయి. దీనిపై నోరా ఫతేహి స్పందిస్తూ షూటింగ్ సమయంలో తనకు ఈ పాట యొక్క అర్థం తెలియదని వివరణ ఇచ్చింది. చివరకు ఈ వివాదానికి ముగింపు పలుకుతూ చిత్ర బృందం యూట్యూబ్ నుండి హిందీ వెర్షన్ సాంగ్‌ను తొలగించడమే కాకుండా, నటుడు సంజయ్ దత్ మరియు నోరా ఫతేహిలు బాలికల విద్యాభివృద్ధికి స్పాన్సర్ చేస్తామని హామీ ఇచ్చారు. 

ALso read: Peddi: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ ఇదే.. హైదరాబాద్ కి షాక్!

బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించిన ఈ హై-యాక్షన్ డ్రామా ఓటీటీ ప్రియులని  ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. కథాంశం విషయానికి వస్తే.. 1970ల నాటి బెంగళూరు అండర్‌వరల్డ్ నేపథ్యంతో సాగుతుంది. కలి దాస అలియాస్ కేడీ చదువుకోకపోయినా, తన కుటుంబంపై ప్రాణం ఇచ్చేంత అంతులేని ప్రేమ మరియు విధేయత కలిగిన అమాయక యువకుడు. అతని అన్న ధర్మ ఎప్పుడూ అతడిని తక్కువ చేసి చూపిస్తూ తిడుతుంటాడు. ఆ నగరంలో అందరూ చూసి భయపడే భయంకరమైన గ్యాంగ్‌స్టర్ డాన్ ధక్ దేవాను కేడీ చిన్నప్పటి నుండి దైవంగా ఆరాధిస్తుంటాడు. అంతటి క్రూరుడైన డాన్‌ను దైవంగా భావించే కేడీ జీవితం, మంచు లక్ష్మి అనే బోల్డ్ మరియు ధైర్యవంతురాలైన అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత ఒక అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. కొన్ని ఊహించని దారుణమైన సంఘటనల వల్ల కేడీ కుటుంబం నేరుగా ధక్ దేవా కంటిలో పడుతుంది. ఆ క్రమంలో తాను దేవుడిగా భావించిన ధక్ దేవా వెనుక ఉన్న నల్లటి నిజాలు, అతను చేసిన మోసాలు, అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న క్రూరమైన నేపథ్యం కేడీకి తెలుస్తుంది. దాంతో తన ఆరాధ్య దైవమైన డాన్‌పైనే యుద్ధం ప్రకటించి, ఒక సాధారణ యువకుడి నుండి అందరూ వణికే భయంకరమైన డెవిల్‌గా కేడీ ఎలా మారాడు అనేదే ఈ చిత్ర ముఖ్య కథాంశం.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.