Home

»

Latest News

జాన్వీ న‌డుం మీద మ‌డ‌త‌... బ‌రువు పెరుగుతోందా?

Feb 8, 2023 9:12AM

జాన్వీ న‌డుం మీద మ‌డ‌త గురించే ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో హాట్ డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. నార్త్ ఇండియన్ మూవీస్‌లో న‌టించ‌డానికి జీరో సైజ్ స‌రిపోతుంది. కానీ సౌత్‌లో సినిమాలు క్లిక్ కావాలంటే హీరోయిన్లు మ‌రీ బ‌క్క‌ప‌ల‌చ‌గా ఉంటే క‌ష్ట‌మే. కాస్త కండ‌పుష్టితో క‌నిపించాలి. ఈ విష‌యాన్ని అర్థం చేసుకున్న‌ట్టున్నారు జాన్వీక‌పూర్‌. ఇప్పుడు ఆమె జిమ్‌లో వ‌ర్క‌వుట్లు చేస్తున్న వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఈ జ‌న‌రేష‌న్ స్టార్స్ లో ఫిట్‌నెస్ ఫ్రీక్ అనే ట్యాగ్‌కి ప‌ర్ఫెక్ట్ గా స‌రిపోయే ఆర్టిస్టుల్లో జాన్వీ కూడా ఉంటారు. అన్నీ ప‌దార్థాల‌ను ఇష్టంగా తినే జాన్వీ క‌పూర్‌,వాటిని అరిగించుకోవ‌డానికి, కొవ్వు క‌రిగించుకోవ‌డానికి జిమ్‌లోనూ అంతే క‌ష్ట‌ప‌డుతుంటారు. ఇంటెన్స్ వ‌ర్క‌వుట్లు చేయ‌డంలో ఆమెని మించిన వారు లేరంటారు ట్రైన‌ర్స్. లేటెస్ట్ గా ఆమె వీడియో ఒక‌టి స్పీడ్‌గా వైర‌ల్ అవుతోంది. న‌డుం మీద మ‌డ‌త‌తో జాన్వీ క‌నిపిస్తున్న ఆ వీడియో మీద నెట్టింట్లో హాట్‌కామెంట్లు చాలా వినిపిస్తున్నాయి. జాన్వీ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ న‌మ్ర‌తా పురోహిత్ ఈ వీడియో షేర్ చేశారు.

స్కై బ్లూ కో ఆర్డ్ జిమ్ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు జాన్వీ. ఫిట్‌నెస్ అనేది జ‌ర్నీ మాత్ర‌మే, డెస్టినేష‌న్ కాదు అని న‌మ్ముతుంటారు జాన్వీ. అందుకే జిమ్‌ని అస‌లు ఎప్పుడూ మిస్ కారు. హార్డ్ వ‌ర్క‌ర్ అంటూ న‌మ్ర‌త కితాబిచ్చారు. షి ఈజ్ ఎ రియ‌ల్ వారియ‌ర్ అని ఓ ఫ్యాన్ కామెంట్ చేస్తే, ఫిట్‌నెస్ గోల్స్ అంటూ మ‌రో ఫ్యాన్ రాసుకొచ్చారు. 2023లో ఇన్‌స్పిరేష‌న్ అంటూ ఇంకొక‌రు డీసెంట్ కామెంట్ చేశారు. ప్ర‌స్తుతం నార్త్‌లో చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు జాన్వీ క‌పూర్‌. ఇప్పుడు ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్‌గా తెలుగులోకి ప‌రిచ‌యం కాబోతున్నారు. ఆవారా త‌మిళ వెర్ష‌న్‌లో న‌టిస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా, అందులో నిజం లేద‌ని చెప్పేశారు బోనీక‌పూర్‌. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com