Home

»

Latest News

రౌడీ స్టార్ యాటిట్యూడ్ మాత్రం మారడం లేదు!

Jan 3, 2023 8:47AM

తెలుగులో ఉన్న యంగ్ స్టార్స్ లో యూత్ లో విపరీతమైన క్రేజ్‌ను  సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈయన ప్రవర్తన, మాట తీరు, ప్రవర్తించే విధానం, మీడియా ముందుకు ఈయన వచ్చే విధానం, వారితో మాట్లాడే విషయాలు... ప్రతిదీ ఒక తనదైన యాటిట్యూడ్ తో ఉంటాయి. నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంటుంది. కానీ దానికి తగ్గ ఫలితాన్ని ఆయన ప్రస్తుతం అనుభవిస్తూనే ఉన్నారు.  పూరీ జగన్నాథ్ తో ఆయన పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ కొట్టాలని చేసిన లైగర్ చిత్రం డిజాస్టర్ అయింది. అంతవరకు ఓకే. ఈడీ  అధికారులు అసలు నీకు రెమ్యున‌రేష‌న్‌ ఎంత ఇచ్చారు?  ఏ రూపంలో ఇచ్చారు? అని  దాదాపు 11 గంటలపాటు ఈ రౌడీస్టార్ ను ఫుట్‌బాల్ ఆడుకున్నారు. దీని తర్వాత ఆయన ఖుషీ  మూవీ ఒప్పుకున్నారు.  ఈ చిత్రం కూడా ఆగిపోయింది. 

ఇందులో హీరోయిన్ అయినా సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం, మరోవైపు మ‌యోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండడంతో ఈ చిత్రం షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ చిత్రం మ‌ర‌లా ఎప్పుడు మొదలవుతుంది అంటే ఒక క్లారిటీ లేదు. సమంత ఆరోగ్యం మీదనే ఈ చిత్రం భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరోవైపు లైగ‌ర్‌ ఇచ్చిన షాక్ తో పూరీతోనే చేయాలని భావించిన జనగణమన చిత్రానికి కూడా జనగణమన పాడేశారు. ఇక ఈయన తాజాగా తనదైన యాటిట్యూడ్ చూపిస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.  కష్టమైనా నష్టమైనా సెలబ్రేట్ చేసుకోవడమే అంటున్నారు.  ముగిసిన ప్రతి ఏడాదిలో విజయాలు, అపజయాలు, నవ్వులు, ఏడుపులు అన్నీ ఉంటాయి. ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడమే అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విజయ్ దేవరకొండ మాల్దీవులకు వెళ్లినట్టు తెలుస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ షాంపెయిన్  తాగుతున్న ఫోటో షేర్ చేశారు. బేర్  బాడీలో రౌడీస్టార్‌ని  చూసి అందరూ ఇతనికి ఇంకా పైత్యం దిగలేదు అంటున్నారు. తన సినిమాల పరిస్థితి... కెరీర్ పరిస్థితి ఇలా ఉంటే ఆయన మాత్రం తను తదుపరి చిత్రం ఎవరితో చేయాలా? అని తల పట్టుకుంటున్నారు. 

ముందుగా సుకుమార్‌తో ఓ సినిమా అనుకున్నా సుకుమార్‌ కూడా ఓకే చెప్పినా అది అట్ట‌కెక్కింద‌ని  స‌మాచారం.  సుకుమార్ ఉన్న  బిజీలో విజయ్ దేవరకొండ తో సినిమా చేయడం ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు. దాంతో విజ‌య్ నానితో జెర్సీ చిత్రాన్ని తీసి హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ గౌతం తిన్ననూరితో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పనులు ఈ ఏడాది వేసవిలో మొదలుకానున్నాయట. అయితే దర్శకుడు పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఆ తర్వాత మాత్రమే ఫ్రీ ప్రొడక్షన్లు పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ మాత్రం వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తహతహలాడుతున్నారు. లాంగ్ గ్యాప్ వస్తే తన కెరీర్ కు న‌ష్టమని ఆయన భావిస్తున్నారు. దర్శకుల పేర్ల‌యితే  చాలామందివి  వినిపిస్తున్నాయి. ఒకరు సుకుమార్ అంటారు... మరొకరు హరీష్ శంకర్ అంటారు... మరొకరు కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే మ‌రో పాన్ ఇండియా చిత్రం అంటారు... మరి కొంద‌రు త‌న‌కు అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగానే అంటారు.  అయితే ముందుగా ఏ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లి రౌడీస్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు  గ్యాప్ రాకుండా చూస్తుందో త్వ‌ర‌లో తేలే అవ‌కాశం ఉంది. ఏది ఏమైనా ఆయ‌న త‌దుప‌రి  విడుదలయ్యే  చిత్రం ఏమిటో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే....!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com