Home  »  News  »  'చెన్నై లవ్ స్టోరీ' సంచలనం.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.!

Updated : Jul 28, 2026

బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు కూడా అద్భుతాలు సృష్టిస్తాయని.. మంచి కథ, మనసును హత్తుకునే కథనం ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపితమైంది. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ' బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. 

ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ, ప్రతిచోటా హౌస్‌ఫుల్ బోర్డులతో సందడి చేస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు రావడం సహజమే. కానీ అసలైన పరీక్ష సోమవారం నాడు మొదలవుతుంది. ఆ వర్కింగ్ డే టెస్ట్‌ను ఈ సినిమా సమర్థవంతంగా ఎదుర్కొని 'మండే టెస్ట్'లో పాస్ అవ్వడమే కాకుండా, బిజినెస్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

సాధారణంగా చిన్న సినిమాలకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవడానికి కనీసం వారం నుంచి పది రోజుల సమయం పడుతుంది. కానీ 'చెన్నై లవ్ స్టోరీ' మాత్రం విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకుని క్లీన్ హిట్ కేటగిరీలో చేరిపోయింది. 

సోమవారం కూడా ఈ సినిమా బుకింగ్స్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. గత 24 గంటల్లోనే బుక్ మై షోలో రికార్డు స్థాయిలో 63.17K టికెట్లు అమ్ముడవడం ఈ సినిమా మేనియాకు అద్దం పడుతోంది.

మండే టెస్ట్ పాస్ అయ్యి, వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో.. లాంగ్ రన్ లో 'చెన్నై లవ్ స్టోరీ' బాక్సాఫీస్ దగ్గర మరిన్ని వండర్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

 

Chennai Love Story, Monday Test, Break Even, Kiran Abbavaram, Sri Gouri Priya

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.