Home  »  News  »  ముంబైలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కొత్త లగ్జరీ ఇల్లు.. ఎన్ని కోట్లో తెలుసా.?

Updated : Jul 27, 2026

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క శర్మ జంట దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, సంపన్నమైన దంపతులలో ఒకరిగా కొనసాగుతున్నారు. క్రీడా, వినోద రంగాలలో అగ్ర శిఖరాలను అధిరోహించిన ఈ స్టార్ కపుల్, తమ సంపాదనను కేవలం వ్యాపారాలలోనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోకి భారీగా మళ్లించి ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. 

తాజాగా ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో రూ. 18.29 కోట్లతో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. గోద్రేజ్ ప్రాపర్టీస్‌కి చెందిన 'గోద్రేజ్ స్కైషోర్' ప్రాజెక్ట్‌లో ఉన్న ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 21, 2026న అధికారికంగా పూర్తయింది. 

విరాట్, అనుష్క కొనుగోలు చేసిన ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్ మొత్తం విస్తీర్ణం 2,644 చదరపు అడుగులు. దీనికిదనంగా 316 చదరపు అడుగుల కేటాయించిన ప్రత్యేకమైన ఎక్స్‌క్లూజివ్ ఏరియాతో పాటు 3 కార్ల పార్కింగ్ సదుపాయాలు ఈ ప్లాట్‌తో పాటు లభిస్తున్నాయి. ఈ హై-ఎండ్ ప్రాపర్టీ కోసం కోహ్లీ దంపతులు కేవలం స్టాంప్ డ్యూటీ కింద ఏకంగా రూ. 1.09 కోట్లు చెల్లించగా, మరో రూ. 30,000 రిజిస్ట్రేషన్ రుసుముగా చెల్లించారు. అపార్ట్‌మెంట్ మొత్తం ధర, కార్పెట్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకి సగటున రూ. 69,159 దాకా వెచ్చించినట్లు స్పష్టమవుతోంది. 

రియల్ ఎస్టేట్ రంగంలో కోహ్లీ దంపతుల పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో అత్యంత భారీ స్థాయిలో విస్తరించి ఉంది. 2026 ప్రారంభంలోనే, అనగా జనవరిలో వారు రాయ్‌గఢ్ జిల్లా ఆలీబాగ్‌లోని జీరాడ్ గ్రామంలో, ప్రముఖ ఆవాస్ బీచ్ సమీపంలో 21,010 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన రెండు భూములను రూ. 37.86 కోట్లకు కొనుగోలు చేశారు. అంతకుముందు 2022లో కూడా ఆలీబాగ్‌లోనే 8 ఎకరాల భూమిని రూ. 19 కోట్లకు కొని, అక్కడ టెంపరేచర్-కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ జకూజీ, స్ప్రావరల్డ్ గార్డెన్, లగ్జరీ విల్లాలను నిర్మించుకున్నారు. ఇవే కాకుండా, విరాట్ కోహ్లీకి గుర్గావ్‌లోని ప్రతిష్టాత్మక డిఎల్ఎఫ్ ఫేజ్ 1లో రూ. 80 కోట్ల విలువైన 10,000 చదరపు అడుగుల భారీ భవంతి ఉంది. అలాగే ముంబై వర్లీలో రూ. 34 కోట్ల విలువైన సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్ కూడా వీరి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. 

క్రికెట్ మైదానంలో పరుగుల వర్షం కురిపించే విరాట్, వెండితెరపై మెరిసే అనుష్క దంపతులు రియల్ ఎస్టేట్‌లో కూడా అంతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

 

 

Virat Kohli, Anushka Sharma, Luxury Apartment, Mumbai

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.