Home  »  News  »  Peddi: నార్త్ అమెరికాలో 'పెద్ది' సరికొత్త రికార్డు!

Updated : May 29, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' (PEDDI) సరికొత్త సంచలనాలకు తెరలేపుతోంది. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకగా, ఆ తర్వాత విడుదలవుతున్న ఒక్కో అప్డేట్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచుతోంది.

ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో రామ్ చరణ్ కు ఉన్న తిరుగులేని మార్కెట్ స్టామినాను ఈ చిత్రం మరోసారి నిరూపిస్తోంది. నార్త్ అమెరికాలో 'పెద్ది' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని రేంజ్ లో సాగుతున్నాయి. జూన్ 3న నార్త్ అమెరికా వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'ప్రత్యంగిర సినిమాస్' (Prathyangira Cinemas) ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది. కాగా, ప్రీమియర్ షోలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, అక్కడ బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' హవా ఇప్పుడే మొదలైపోయింది.

నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ (Pre-Sales) లో 'పెద్ది' చిత్రం ఏకంగా $650K డాలర్ల మార్కును దాటేసి సరికొత్త రికార్డు వైపు దూసుకుపోతోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ స్థాయి వసూళ్లు రావడం చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం $650,000 డాలర్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం, కేవలం ప్రీమియర్స్ తోనే మిలియన్ డాలర్ల క్లబ్ లో చాలా ఈజీగా చేరిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రీ-సేల్స్ ట్రెండ్ చూస్తుంటే నార్త్ అమెరికాలో రామ్ చరణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే సినిమాగా 'పెద్ది' నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యం ఉన్న ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.