Home  »  News  »  Arjun: సనాతన ధర్మంపై అర్జున్ సంచలన వ్యాఖ్యలు.. ఆ బడా హీరోకి కౌంటర్ ఇచ్చినట్లేనా! 

Updated : May 29, 2026

 

సౌత్ సినీ పరిశ్రమలో యాక్షన్ కింగ్ అర్జున్(Arjun)కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. బేసిక్ గా కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన అర్జున్ తెలుగులో చేసిన మొదటి సినిమా 'మా పల్లెలో గోపాలుడు' మూవీతో 21 కేంద్రాల్లో వందరోజులు పూర్తి చేసుకొని స్టేట్ రికార్డు సాధించాడు.  ఇది అర్జున్ అంటే. ప్రస్తుతం బ్లాస్ట్ జోనర్(Blost Jonar)తో థియేటర్స్ లో ఉన్నాడు. రీసెంట్ గా ఈ మూవీ సక్సెస్ మీట్ చెన్నైలో జరగగా సనాతన దర్మంపై అర్జున్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా నిలిచాయి.  

అర్జున్ మాట్లాడుతు 'సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియకుండా చాలా మంది మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అనేది కేవలం ఒక మతం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన  పవిత్రమైన జీవన విధానం. సమాజంలో మనుషులు ఎలా ప్రవర్తించాలి, ఎలా బతకాలి అనే విషయాలని నేర్పుతుంది. ఎవరికీ కీడు చేయకూడదని, ఇతరుల వస్తువులని  దొంగిలించకూడదని, తోటి వారిపై అసూయ పడకూడదని మనకి బోధిస్తుంది. ముఖ్యంగా, కన్నతల్లిదండ్రులని, భగవంతుడిలా ఎలా గౌరవించాలో, వారి వృద్ధాప్యంలో మన పిల్లలని చూసుకున్నట్లే వారిని ఎంత ప్రేమగా చూసుకోవాలో ఈ జీవన విధానం మనకు నేర్పుతుంది.

also read: kd The devil: వివాదాస్పద మూవీ కేడీ: ది డెవిల్ ఓటిటి డేట్ ఇదే 

సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న వారికి అర్జున్ నా సూటి ప్రశ్న. ఒకవేళ ఈ సమాజంలో సనాతన ధర్మమే వద్దనుకుంటే, అది బోధించే నైతిక విలువలు అక్కర్లేదనుకుంటే, మొదట మీ కన్నతల్లిదండ్రులని ఇళ్ల నుంచి బయటకి గెంటేయాలి. అది సాధ్యమేనా? . పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా, ఆరాధ్య దైవాలుగా చూస్తారని, మరి వారు వృద్ధులైనప్పుడు అదే బాధ్యతతో చూసుకోవడం సనాతన సంప్రదాయం కాదా. తల్లిదండ్రులని వదిలేయడం సాధ్యం కానప్పుడు, దానికి కారణమైన సనాతన ధర్మాన్ని మాత్రం ఎలా అంతమొందిస్తారని ఆయన నిలదీశారు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో డిఏంకే ఎమ్ ఎల్ ఏ, ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతు మనుషులని విభజించే సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మించాలని  చెప్పాడు.  ఆ సమయంలో మరో హీరో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏం మాట్లాడకుండా  సైలెంట్ గా ఉన్నాడు. అలాంటి ఈ టైంలో సనాతన దర్మం యొక్క గొప్పతనాన్ని చెప్తూ  అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పైగా చెన్నైలోనే మాట్లాడటం గమనార్హం. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.